
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల బదిలీల ప్రక్రియ ప్రారంభం
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ బదిలీ
టీటీడీలో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా టీటీడీ మహిళా పాలిటెక్నిక్ (TTD Women's Polytechnic) కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.అసుంతను (G. Asuntha ) బదిలీ చేశారు. ఈ మేరకు ఆమెను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ విధుల నుంచి తప్పించి. నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ శుక్రవారం టీటీడీ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన వారికి కూడా త్వరలో బదిలీలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. టీటీడీ పాలక మండలి (TTD BOARD) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు. టీటీడీ 47 మంది అన్యమతస్థులను గుర్తించింది. వీరికి ఆలయానికి సంబంధించి కీలక విభాగాలు ఆధ్యాత్మిక, ధార్మిక, విద్యా క్షేత్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించాలని నిర్ణయించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి ( TTD BOARD) సమావేశంలో అన్యమత ఉద్యోగుల అంశం పై చర్చించారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బదిలీల ప్రక్రియ ప్రారంభించారు.