ట్రంప్ తెచ్చిన తంటా.. తెలుగోళ్ల కొంప ముంచిందంటా!
x

ట్రంప్ తెచ్చిన తంటా.. తెలుగోళ్ల కొంప ముంచిందంటా!

ఇకపై హెచ్-1బీ వీసా ఫీజు రూ.83 లక్షలు… తెలుగు ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి?


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా సంతకం ఆదేశంలోని ఇండియన్లకి ప్రత్యేకించి తెలుగు వాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ట్రంప్ తాజా ఉత్తర్వు భారత్‌ నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వేలాది ఐటీ నిపుణుల్లో కలవరం రేపింది.

సెప్టెంబర్ 19, 2025న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ఉత్తర్వుపై సంతకం చేశారు. దాని ప్రకారం ప్రతి హెచ్-1బీ వీసాదారు తన వీసా గడువు పొడిగింపు కోసం ఏటా $100,000 (దాదాపు ₹83 లక్షలు) ఫీజు కట్టాలి. ఇది నిజంగా పిడుగు లాంటి వార్తే. ఇప్పటి వరకు ఉన్న ఫీజులు కొన్ని వేల డాలర్లలో ఉండగా, ఇప్పుడు ఒకేసారి లక్ష డాలర్లకు పెంచడం వలసదారులందర్నీ షాక్‌కు గురిచేసింది.
ఎవరు ఎక్కువగా దెబ్బతింటారు?
హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా 72%కుపైగా ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీరి సంఖ్య సుమారు 5 లక్షలుగా ఉంటుందని అంచనా. వీళ్లు గాక మరో 2 లక్షల మంది గ్రీన్ కార్డు,పౌరసత్వ హోదా కలిగిన వారు ఉన్నట్టు అధికారిక అంచనా.
అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్ 1 బీ వీసా తప్పనిసరి. అది ఉన్న వాళ్లకే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు 12 నుంచి 25 లక్షల రూపాయల మధ్య ఖర్చు పెడితే ఆ వీసాలు వస్తుండేవి. ఇప్పుడది సాధ్యం కాదు.
చిన్న కంపెనీలు, కన్సల్టెన్సీలు తమ ఉద్యోగులపై ఇంత భారీ ఫీజు భరించలేకపోవచ్చు. ఫలితంగా కొత్త వీసాలు ఇవ్వడంలో, రెన్యువల్స్ చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎక్కువ మంది అంత డబ్బు పెట్టి వీసాలు తెచ్చుకునేందుకు ముందుకు పోయే ఛాన్సే లేదు.
పెద్ద టెక్ కంపెనీలు మాత్రం కొంతవరకు భరించగలిగినా, ఖర్చులు పెరగడం వల్ల నూతన నియామకాలు తగ్గే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం ఎంత?
తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన వేలాది మంది యువకులు హెచ్-1బీ వీసా మీదే అమెరికాలో ఉంటున్నారు. వాళ్లలో చాలా మంది ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు ద్వారా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఫీజు భారంతో ఆ కంపెనీలు కొత్త వీసాలు ఫైల్ చేయడమే గాక, ఉన్నవారికి ఎక్స్‌టెన్షన్ ఇవ్వడానికీ వెనకడుగు వేయొచ్చు.
అమెరికాలో ఇప్పటికే పనిచేస్తున్నవారు ఉద్యోగం మార్చుకోవడం కష్టమవుతుంది, ఎందుకంటే ప్రతి సారి ట్రాన్స్‌ఫర్/రెన్యువల్‌కు ఈ భారీ రుసుం వర్తిస్తుంది.
వీసా గడువు ముగిస్తే?
ఎంప్లాయర్ పొడిగిస్తే: వీసా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కొత్త ఫీజు చెల్లించే ధైర్యం చేస్తారా ప్రధాన ప్రశ్న.
ఎంప్లాయర్ పొడిగించకపోతే: స్టేటస్ మార్చుకోవాలి. ఉదా: F-1 (మళ్ళీ చదువు), L-1 (ఇన్‌ట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్), O-1 (ప్రత్యేక నైపుణ్యం) వంటి మార్గాలు ఉన్నాయి.
మరో ఆప్షన్: కెనడా, యుకె, ఆస్ట్రేలియా లాంటి దేశాలు – ఈ మధ్య హైటెక్ టాలెంట్ కోసం ప్రత్యేక వీసా మార్గాలు తెరుస్తున్నాయి.
ఎందుకు ఈ నిర్ణయం?
ట్రంప్ “అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే” అన్న స్లోగన్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం విదేశీయుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని వాదిస్తున్నారు.
కానీ అమెరికన్ కంపెనీలు మాత్రం ఈ ఫీజు వల్ల ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు రావడం తగ్గిపోతుందని, చివరికి తమకే నష్టం అవుతుందని చెబుతున్నాయి.
ప్రభావం ఎంతవరకు ఉంటుంది?
వ్యక్తిగత స్థాయిలో: తెలుగు ఐటీ నిపుణుల కుటుంబాలకు ఇది భారీ ఆర్థిక భారం. ఎంప్లయర్ సహకరించకపోతే అమెరికాలో భవిష్యత్తు అనిశ్చితంగా మారవచ్చు.
సామాజిక స్థాయిలో: రిజర్వేషన్ అంశాలపై ఉన్న వాదోపవాదాల మధ్య, యువత అమెరికా కలలపైనే కొత్త చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.
ఆర్థికంగా: అమెరికాలో తెలుగు ఐటీ ఉద్యోగుల రిమిటెన్స్ (ఇంటి వారికి పంపే డబ్బు) తగ్గితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది.
ముందున్న దారులు
లీగల్ సవాళ్లు: ఇప్పటికే పలు సంస్థలు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయబోతున్నాయి. కాబట్టి ఇది వెంటనే అమలవకపోవచ్చు.
ఎంప్లాయర్ వ్యూహం: పెద్ద కంపెనీలు కొంత మందిని కొనసాగిస్తాయి, కానీ కొత్త నియామకాలు తగ్గిస్తాయి.

వ్యక్తిగత ప్రణాళికలు: అమెరికాలో ఉన్నవారు వెంటనే తమ ఇమ్మిగ్రేషన్ లాయర్ని సంప్రదించి గ్రీన్‌కార్డ్ ప్రాసెస్‌లో ముందుకు వెళ్లే మార్గాలు వెతకాల్సిందే.
EAD/గ్రీన్‌కార్డు పాత్: ఇప్పటికే PERM/I-140 లో ముందుకు వెళ్లినవారికి ఎంప్లాయర్ (కంపెనీలు) సపోర్ట్ ఉంటే AC21 నియమాల కింద పొడిగింపులు సాధ్యం (ప్రస్తుత పాలసీ ప్రకారం; కొత్త ఫీజు వల్ల కూడా ఎంప్లాయర్ నిర్ణయం కీలకం).
డాక్యుమెంటేషన్ రెడీ: పేస్లిప్స్, LCA, I-94, పాస్‌పోర్ట్ వాలిడిటీ—స్కాన్/హార్డ్‌కాపీ.
గ్రీన్‌కార్డు ట్రాక్ చెక్: PERM/I-140 స్టేటస్, AC21 ఎక్స్‌టెన్షన్ ఎలిజిబిలిటీ.
బ్యాకప్ మార్కెట్లు: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ/గ్లోబల్ టాలెంట్—జాబ్ సెర్చ్ ప్రిప్.
ఈ ఫీజు వెంటనే అమలేనా? — ప్రొక్లమేషన్ వెలువడింది; అమలు-విధానం/డేట్ USCIS గైడెన్స్ & కోర్టు పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈనెల 21 అర్ధరాత్రి నుండి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే H1 B వీసా పై ఉన్నవారు అమెరికా వెలుపల ఉంటే మరో 24 గంటల్లో (21 సెప్టెంబర్ 2025 అర్థరాత్రి కల్లా) తిరిగి రావడం మంచిదని IT దిగ్గజం మైక్రోసాఫ్ట్ సూచించింది.
హెచ్-1బీ వీసా కల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతకు ఒక పెద్ద ఆశ. కానీ సంవత్సరానికి లక్ష డాలర్లు (₹83 లక్షలు) అనే భారీ రుసుము ఈ కలను చేదు నిజంగా మార్చేసింది.
Read More
Next Story