ఆంధ్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా త్రివిక్రమరావు
x

ఆంధ్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా త్రివిక్రమరావు

పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండు సంవత్సరాలపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషాసంఘానికి కొత్త అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన, పర్యాటక–సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండు సంవత్సరాలపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు భాష వినియోగాన్ని పర్యవేక్షించడం, వాడుక తీరుపై తనిఖీలు చేయడం, అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వడం వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వం భాషాసంఘానికి అప్పగించింది.

అధికార కార్యక్రమాల్లో తెలుగు వినియోగం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, అలాగే ప్రభుత్వ నిర్వహణలో జరిగే అధికార కార్యక్రమాల్లో ఆంగ్లభాష వాడకంపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా, తీసుకునే చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కార్యక్రమాల్లో తెలుగు వినియోగం ఎంత మేరకు అమలవుతున్నదీ భాషాసంఘం తరచూ సమీక్షించాల్సివుంది. అధికార భాష అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వం కోరినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు భాష ప్రోత్సాహానికి సంబంధించిన అన్ని చర్యలపై నివేదికను ప్రభుత్వం తరచూ స్వీకరించనుంది.

Read More
Next Story