‘ఆ నలుగురికి’ నివాళులు
x

‘ఆ నలుగురికి’ నివాళులు

ముగ్గురు ప్రముఖల జయంతి, ఒక తత్వవేత్త వర్థంతి సందర్భంగా లోకేష్‌ నివాళులు అర్పించారు.


నేడు నాటి బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కాగా భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాపితం చేయడంతో పాటు భారత దేశ యువతకు స్పూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద వర్థంతి. ఈ సందర్భంగా నలుగురు మహనీయులకు మంత్రి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

భారత స్వాతంత్యోద్యమ చరిత్రలో బ్రిటీష్‌ వారికి సింహస్వప్పంగా నిలిచిన గొప్ప పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు, మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్‌ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరింకితం అవుతాం. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారం. విభిన్న రంగాల్లో తనదైన ప్రతిభ చూపారు. భాతర జాతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. అంటూ లోకేష్‌ నివాళులు అర్పించారు.

దేశప్రతిష్టను విశ్వవాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద.. యువతకు స్పూర్తిదాతగా నిలిచారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అవధులు లేని త్యాగం, అంచలంచల కృషి, అంతులేని ప్రేమ, అజరామరమైన సాహసం ఆయన సొంతం. తన ప్రసంగాలతో యువతకు దిశానిర్థేశం చేసిన స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అంటూ లోకేష్‌ పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలకమైన నిర్వహించిన రోశయ్య ఆయా శాఖలలో తనదైన ముద్ర వేశారు. రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. అంటూ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.


Read More
Next Story