
వీర జవాన్ మురళీనాయక్‌కు వైసీపీ కార్యాలయంలో నివాళి
ఈ నెల 13న కల్లి తండాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు.
ఇండియా–పాకిస్తాన్ యుద్ధ రంగంలో పోరాడి భారత దేశం కోసం వీర మరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర జవాన్ మురళీ నాయక్‌కు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఘన నివారిళి అర్పించింది. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మురళీ నాయక్ వీర మరణం ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. యావత్ భారత దేశానికే స్పూర్తి దాయకమని నాయకులు కొనియాడారు. పేద కుటుంబమైనప్పటికీ దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ ప్రజలు శ్రేయస్సు కోసం సైన్యంలో పని చేయాలనే మురళీ నాయక్ ఆలోచనలు అందరికీ ఆదర్శమని కొనియాడారు.
ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన పోరాటంలో నేలకొరిగిన మురళీ నాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడి పరామర్శించిన జగన్ నేరుగా వారి ఇంటికెళ్లి స్వయంగా కలిసి వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.
పాకిస్తాన్ సైనికులతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన మురళీ నాయక్ అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల క్రితమే భారత సైన్యంలో చేరారు. తర్వాత నాసిక్‌లో శిక్షణ పొందారు. అనంతరం అసోంలో పని చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నెలకొన్న నేపథ్యంలో మురళీ నాయక్ జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇండియాపైకి పాకిస్తాన్ సైనికులను నిలువరించి, అడ్డుకునే ప్రయత్నంలో మురళీ నాయక్ వీర మరణం పొందారు.
Next Story