ట్రావెల్‌ బస్సు నిర్వాకం..విలవిలలాడిన గొర్రెలు
x

ట్రావెల్‌ బస్సు నిర్వాకం..విలవిలలాడిన గొర్రెలు

మితిమీరిన వేగం వందలాది జివాల ఉసురు తీసింది. మందగా వెళ్తున్న గొర్రెలపై అమాంతంగా దుసుకెళ్లడంతో స్పాట్‌లోనే వందల గొర్రెలు మరణించాయి.


రోడ్డు పక్కన వెళ్తున్న 400 వందల గొర్రెల మందపై మధమెక్కిన ఓ ప్రెయివేటు ట్రావెల్స్‌ బస్సు అమాంతంగా దూసుకెళ్లింది. నోరులేని ఆ జివాలు బస్సు కింద పడి విలవిలలాడి పోయాయి. వందల సంఖ్యలో స్పాట్‌లోనే నేలకొరిగాయి. వందల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. వాటి వెంట నడుస్తున్న గొర్రెల కాపరి పరిస్థితి విషమంగా మారింది. ఈ హృదయ విదారకర దుర్ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న శ్రీ మారుతీ ట్రావెల్స్‌ బస్సు, పులిపాడు నుంచి దాచెపల్లి వైవు వెళ్తున్న 400లకుపైగా ఉన్న గుర్రెల మందపైకి అమాంతంగా దూసుకుని పోయింది. ఈ దుర్ఘటనలో 150 గొర్రెలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాయి. గొర్రెల మందకు కాపలా ఉన్న వ్యక్తిని కూడా ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆ గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటన పధేశానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేపుకుని దర్యాప్తు చేపట్టారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, గొర్రెల కాపరి కుటుంబ సభ్యులు సంఘటన ప్రదేశానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని దాచేపల్లి సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అద్దంకి, నార్కెట్‌ పల్లి హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా ఎస్‌పి శ్రీనివాస్‌ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితినఅ అదుపులోకి తెచ్చారు. మరో వైపు ప్రమాదం చేసిన ట్రావెల్స్‌ డ్రైవర్‌ అక్కడ నుంచి పారిపోయాడు.
Read More
Next Story