
అమెరికాలో పాలకొల్లు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ లో రోడ్డు ప్రమాదం, దంపతులు మృతి, పిల్లలకు గాయాలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన తెలుగు దంపతులు మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రమాదంలో వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వారి కుటుంబసభ్యులకు అందినట్లు తెలిసింది.
Next Story

