మండుటెండల్లో ప్రముఖుల ప్రచారం
x

మండుటెండల్లో ప్రముఖుల ప్రచారం

ఆదివారం నాడు బీజేపీ అభ్యర్ధుల తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారం కోసం అగ్రనేత రాహుల్ గాంధి వివిధ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.


అసలే ఎండలు మండిపోతున్నాయి. ఏరోజు తీసుకున్నా ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు తగ్గటంలేదు. ఎండలు మండిపోతుండటం ఒకటి, వేడికారణంగా ఉక్కపోత మరోటి. దాంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎన్నికల తేది దగ్గరకొస్తున్న నేపధ్యంలో పనిలోపనిగా ఎన్నికలవేడి కూడా పెరిగిపోతోంది. అభ్యర్ధుల తరపున ప్రచారంకోసం ప్రముఖులు వస్తుండటంతో ఎన్నికలవేడి బాగా పెరిగిపోతోంది. ఆదివారం నాడు బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారం కోసం అగ్రనేత రాహుల్ గాంధి వివిధ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అమిత్ పాల్గొంటున్న కార్యక్రమాల్లో కేంద్రమంత్రి, పార్టీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి కూడా ఉంటారు. అలాగే రాహుల్ సభల్లో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉంటారు.

ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుండి నేరుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అసిఫాబాద్ కు వెళతారు. అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడినుండి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ చేరుకుంటారు. గిరారాజ్ కాలేజీలో జరిగే బహిరంగసభలో మాట్లాడుతారు. తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేటలోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొంటారు. మళ్ళీ రాత్రి 8 గంటలప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుండి పశ్చిమబెంగాల్ కు వెళిపోతారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణాలో పర్యటిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, మధ్యాహ్నం 1 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని చౌట్టుపల్, మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో నల్గొండ బహిరంగసభలో పాల్గొంటారు.

ఇక రాహుల్ గాంధి ఆదివారం ఉదయం ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నిర్మల్, నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలోని గద్వాల బహిరంగసభల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతున్న రాహుల్ మళ్ళీ 9వ తేదీన వస్తున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు కరీంనగర్ బహిరంగసభలోను అదేరోజు సాయంత్రం సరూర్ నగర్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వీళ్ళ పర్యటన ఇలాగుంటే కేసీయార్ జగిత్యాల రోడ్డుషోలో పాల్గొనబోతున్నారు.

Read More
Next Story