దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉండాలి
x

దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉండాలి

రాష్ట్రంలోని ప్రతీ రహదారి పనులకు డెడ్‌లైన్‌ పెట్టుకుని ఆ ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.


రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత–నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని... అలాగే తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ రహదారి పనులకు డెడ్‌లైన్‌ నిర్దేశించి, అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని స్పష్టం చేశారు. వర్షాకాల రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. 8,744 కి.మీ వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2,683 కి.మీ. రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఆర్‌ అండ్‌ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు. ఆర్‌ అండ్‌ బీలో ఉన్న 304 ఏఈ పోస్టుల ఖాళీల్లో గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సివిల్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో 97 శాతం మరమ్మతులు పూర్తి
రాష్ట్రంలో రూ.860 కోట్లతో 20,060 కి.మీ. పొడవునా గుంతలు లేకుండా చేపట్టిన మరమ్మతుల పనులు 97 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ, మార్త్‌కి సంబంధించి రూ.78,295 కోట్లతో 3,510 కి.మీ. పొడవైన.. 146 పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2024–25లో ఎన్‌హెచ్‌ఏఐ, మార్త్‌కి సంబంధించి రూ.11,682 కోట్లతో 546 కి.మీ. పొడవైన.. 22 పనులు పూర్తి చేశామని చెప్పారు. 2025–26లో ఎన్‌హెచ్‌ఏఐ, మార్త్, ఆర్‌ అండ్‌ బీకి సంబంధించి రూ.47,788 కోట్లతో 1,186 కి.మీ. పొడవైన... 46 పనులు పూర్తి చేస్తామని అన్నారు.
Read More
Next Story