‘ఫోర్న్ వెబ్ సైట్లు, గంజాయి యువతను పెడదారి పట్టిస్తున్నాయి’
మహిళల మీద దాడులను నిరసిస్తూ తిరుపతిలో పౌర చైతన్య వేదిక సభ
తిరుపతి : మహిళలపైన, చిన్నపిల్లలపైన అత్యాచారాలు, హత్యలు మానవ నాగరికతనే ప్రశ్నిస్తున్నాయని ఎస్ వి విశ్వవిద్యాలయం ప్రాచ్య
పరిశోధన సంస్థ సంచాలకులు ఆచార్య పి సి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం ఎస్ వి యూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో పౌర చైతన్య వేదిక మహిళల మీద దాడులను నిరసిస్తూ నిర్వహించిన
సదస్సులో ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ ఆయన జనారణ్యంలోని మానవ మృగాల ఆటకట్టించేం దుకు ప్రభుత్వాలు సత్వర చర్యలు
చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగ తీర్చిదిద్దవలసిన బాధ్యత నుంచి ప్రభు త్వాలు వైదొలగి విద్యారంగం
కార్పొరేట్ పరం కావడం శోచనీయమన్నారు. ఫోర్న్ వెబ్ సైట్లు, గంజాయి యువతను పెడదారి పట్టిస్తున్నాయని తత్వశాస్త్ర అధ్యాపకుడు డా. నాగులూరు దయాకర్ ఆరోపించారు.
సభాధ్యక్షులు వాకా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలూ ప్రభుత్వమూ కలసికట్టుగా ఉద్యమించినప్పుడే మహిళలకు భద్రత కల్పించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఆచార్య చక్రవర్తి రాఘవన్, సాకం నాగరాజ, పౌర చైతన్య వేదిక నాయకులు -
ఎ ఎన్ పరమేశ్వర రావు, హరీష్, ప్రతాప్ సింగ్, లక్ష్మి ప్రసంగించారు.
విద్యార్థులు అజయ్, వెన్నెల, యామిని, ప్రీతి, ఇందు మతి , నందిని, సాయి సాకేత్ లు ప్రసంగిస్తూ స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాల పట్ల తమ
ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం
చేశారు.
Next Story