80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘాట్ రోడ్
x

80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘాట్ రోడ్

తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి ఉంది. అక్కడ శ్రీవారి దర్శనమే కాదు శ్రీవారి సన్నిధికి వెళ్లే మార్గం కూడా అత్యంత మధురంగా ఉంటుంది.


తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి ఉంది. అక్కడ శ్రీవారి దర్శనమే కాదు శ్రీవారి సన్నిధికి వెళ్లే మార్గం కూడా అత్యంత మధురంగా ఉంటుంది. కాలం ఏదైనా ఆ ఘాట్ రోడ్ అందంకానీ, ఆ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కలిగే ఆహ్లాదం కానీ ఏమాత్రం తగ్గవు. వెళ్లిన ప్రతిసారి ఆ ఏడు గిరులు తమ కొత్త రూపాన్ని చూపిన అనుభూతిని కలిగిస్తాయి. ఎంత చూసినా తరగని సంతృప్తి ఆ ఏడు కొండల వాడిదైతే ఎంత ప్రయాణించినా అలుపు రాని మార్గం ఆ ఘాట్ రోడ్డుకే దక్కుతుంది. ఎంతో మందికి ఒక తీపి జ్ఞాపకంగా ఉండే ఈ ఘాట్ రోడ్డు తాజాగా తన 80 వార్సికోత్సవాన్ని పూర్తి చేసుకుంది.

18 నిమిషాల పాటు ఈ ఘాట్ రోడ్డు గుండా సాగే ప్రయాణం ఒక అందమైన కలలా ఉంటుంది. అడుగడుగునా ప్రకృతి సోయగాలు, గిరులపై నుంచి వచ్చి గిలిగింతలు పెట్టే కొండగాలిని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆ ఆహ్లాదాన్ని చెప్పాలంటే మాటలు సరిపోవు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఘాట్ రోడ్లు ఉన్నప్పటికీ తిరుపతి దేవదేవుడికి మనల్ని తీసుకుని వెళ్లే ఈ ఘాట్ రోడ్డుపై సాగే 18 నిమిషాల ప్రయాణం మనకు ఎంతో కొత్త అనుభూతికి కలిగిస్తుంది. మరి ఇంతటి సుందరమైన ఘాట్‌ రోడ్డు ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారో తెలుసుకుందామా..

Read More
Next Story