తిరుమల బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఏరోజు ఏం చేస్తారంటే..
x

తిరుమల బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఏరోజు ఏం చేస్తారంటే..

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఒక్కడ జరిగే పూజలకు ఎంత ప్రాధాన్యత ఉందే తిరుమల బ్రహోత్సవాలకు అంతకు మంచిన ప్రాధాన్యత ఉంది.


ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఒక్కడ జరిగే పూజలకు ఎంత ప్రాధాన్యత ఉందే తిరుమల బ్రహోత్సవాలకు అంతకు మంచిన ప్రాధాన్యత ఉంది. ఈ బ్రహ్మోత్వవాల్లో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్‌ను టీటీడీ యాజమాన్యం విడుదల చేసింది. ఈ బ్రహ్మోత్మవాలు ఈ ఏడాది అక్టోబర్ నెలలో 4 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

అంతేకాకుండా 2024లో ఒకసారి మాత్రమే బ్రహ్మోత్వవం జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది అధికమాసం లేదని, కాబట్టి సాలకట్ల బ్రహ్మోత్వవం(సాలకట్ల అంటే వార్షికం), నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిసి ఒక బ్రహ్మోత్సవం మాత్రమే జరుగుతుందని టీటీడీ తెలిపింది. ఈ ఎన్నిమిది రోజుల్లో స్వామివారికి చేసే సేవలకు సంబంధించి సమాచారన్ని, పెట్టే నైవేథ్యం వంటి వివరాలను కూడా వారు వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి..

తిరుపతి బ్రహ్మోత్సవం షెడ్యూల్ :

3 అక్టోబర్ 2024 - గురువారం రాత్రి: 7 నుండి 8 వరకు - అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన

4 అక్టోబర్ 2024 - శుక్రవారం - 1వ రోజు మధ్యాహ్నం: 3.30 నుండి 5.30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం: సుమారు 6 గంటలకు - ద్వజారోహణం (ధ్వజారోహణం)

రాత్రి: 9 గంటల నుండి 11 గంటల వరకు - పెద్ద శేష వాహనం

5 అక్టోబర్ 2024 - శనివారం - 2వ రోజు

_ ఉదయం: 8 నుండి 10 వరకు - చిన శేష వాహనం

_ మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు - స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)

_ రాత్రి: 7 నుండి 9 గంటల వరకు - హంస వాహనం

6 అక్టోబర్ 2024 - ఆదివారం - 3వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు - సింహవాహనం

_ మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు - స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)

_ రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు - ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)

7 అక్టోబర్ 2024 - సోమవారం - 4వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు కల్పవృక్ష వాహనం

_ సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు - సర్వభూపాల వాహనం

8 అక్టోబర్ 2024 - మంగళవారం - 5వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు - మోహినీ అవతారం

_ రాత్రి: సుమారు 7 గంటల నుండి 12 గంటల వరకు - గరుడ వాహనం

9 అక్టోబర్ 2024 - బుధవారం - 6వ రోజు

_ ఉదయం: 8 నుండి 10 వరకు - హనుమంత వాహనం

_ సాయంత్రం: 4 నుండి 5 గంటల వరకు - స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం)

_ రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు - గజవాహనం

10 అక్టోబర్ 2024 - గురువారం - 7వ రోజు

_ ఉదయం: 8 నుండి 10 వరకు - సూర్య ప్రభ వాహనం

_ మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు - స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)

_ రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం

11 అక్టోబర్ 2024 - శుక్రవారం - 8వ రోజు

_ ఉదయం 6 గం - రథోత్సవం (రథం, రథోత్సవం)

_ సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు - అశ్వవాహనం

12 అక్టోబర్ 2024 - శనివారం - 9వ రోజు

_ తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు - పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం

_ ఉదయం 6 నుండి 9 వరకు - స్నపన తిరుమంజనం, చక్రస్నానం.

Read More
Next Story