
రానున్న మూడు గంటల్లో పిడుగుల వర్షం
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాలోని పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, విజయనగరంలో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల లోపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.
శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల క్రింద ఉండరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
Next Story