గురువారం ఐదు జిల్లాల్లో పిడుగుపాటు వర్షాలు
x

గురువారం ఐదు జిల్లాల్లో పిడుగుపాటు వర్షాలు

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 61మిమీ కురిసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబరు 11 గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 61మిమీ, యలమంచిలిలో 60.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 49.5మిమీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 49మిమీ, అనకాపల్లి జిల్లా చోడవరంలో 48.2మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
Read More
Next Story