పిండ ప్రధానం కోసం పిఠాపురం వెళ్తూ ముగ్గురు మృతి
x

పిండ ప్రధానం కోసం పిఠాపురం వెళ్తూ ముగ్గురు మృతి

కుక్కను తప్పించబోయిన ఓ కారు బోల్తాపడి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.


తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేయాలని ఆశపడి తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయానికి కారులో బయలు దేరి ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి వ్యక్తులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా మార్డూరు మండలం కోలలపూడి వద్ద జాతీయ రహదారిపైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేయాలని ఆశపడిన ఓ కుటుంబం తిరుపతి నుంచి కారులో పిఠాపురం దేవాలయానికి బయలుదేరింది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి జాతీయ రహదారి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారుకు ఓ కుక్క అడ్డం వచ్చింది. కారును నడుపుతున్న వ్యక్తి ఆ కుక్కను తప్పించబోయాడు. దీంతో వేగంతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపు తప్పింది. స్పీడ్‌ కంట్రోల్‌ కాకపోవడంతో ఆ కారు బోల్తా కొట్టడంతో పాటుగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు నుజ్జు నుజ్జు అయిన ఈ దుర్ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయి అక్కడిక్కడే స్పాట్‌లో మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్సల కోసం స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను దామర్ల లక్ష్మణ్, ఆయన భార్య సుబ్బాయమ్మ, మనవడు హేమంత్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More
Next Story