
ఎస్సార్పీలకు మూడు రోజుల శిక్షణ
ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ కు మూడు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.
డిఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ (ఎస్‌ఆర్‌పీలు)కు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 3 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ 16 సెప్టెంబర్ 2025 నుంచి 18 సెప్టెంబర్ 2025 వరకు జరుగుతుంది. ప్రాథమిక స్థాయి ఎస్‌ఆర్‌పీలకు (313 మంది) ఎన్టీఆర్ జిల్లాలోని ఆగిరిపల్లి మండల కేంద్రంలోని హీల్ ప్యారడైజ్‌లో, ద్వితీయ స్థాయి ఎస్‌ఆర్‌పీలకు (475 మంది) గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద విట్ యూనివర్సిటీలో ఈ శిక్షణ జరుగుతోంది.
మొత్తం 788 మంది ఎస్‌ఆర్‌పీలకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఆధునిక విద్యలో ఉపాధ్యాయుల పాత్ర, పాఠ్యప్రణాళిక పెడగాజీ, మోడల్ లెసన్ ప్లానింగ్, తరగతి నిర్వహణ, విద్యార్థుల అభివృద్ధి, అంచనా, మానిటరింగ్, ఐసీటీ & డిజిటల్ లెర్నింగ్, టీఎల్ఎమ్, అకడమిక్ క్యాలెండర్, టీచర్ హ్యాండ్‌బుక్, స్టూడెంట్ అసెస్‌మెంట్ బుక్‌లెట్, పాఠ్యప్రణాళిక ఇంటిగ్రేషన్, ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్, ఎన్‌ఈపీ-2020 అమలు, లీప్ యాప్ వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణకు వచ్చిన వారు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. శిక్షణ పూర్తయిన తర్వాత ఏపీటీఏ నిబంధనల ప్రకారం టీఏ, డీఏలు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తారు. దీనికి బ్యాంక్ అకౌంట్ వివరాలు (అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్యాంక్ పేరు) మరియు పీఎఫ్‌ఎమ్‌ఎస్ నెంబర్ తీసుకురావాలి. కోర్సు కోఆర్డినేటర్లుగా డాక్టర్ డీ.వీ. శ్రీమన్నారాయణ (8074149788), ఎం. రవీంద్ర ప్రసాద్ (9661646850), జి. మహేశ్వర రెడ్డి (8074175258)లు వ్యవహరిస్తున్నారు.