పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడే వాళ్లు అక్కడికే వెళ్లిపోండి
x

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడే వాళ్లు అక్కడికే వెళ్లిపోండి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉగ్ర దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


మతాన్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడాలని అనుకుంటే.. అలా మాట్లాడాలని అనుకునే వాళ్లు ఎవరైనా పాకిస్తాన్‌నుకు వెళ్లి పోవాలని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెషన్‌ హాల్‌లో ఇటీవల పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. మత ప్రాతిపదికన సాధారణ పౌరులను చంపడం సహించరాని నేరమని అన్నారు. 26 మందిని చంపినా పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని పిలుపునిచ్చారు.

కశ్మీర్‌ అనేది భారత దేశంలో ఒక భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడ కూడదని హితం చెప్పారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ రావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నినాదానికి జనసేన ఎప్పుడూ మద్దతుగా ఉంటుందన్నారు. ‘ సత్యం మాట్లాడాలంటే ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు. కుటుంబంతో కాశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. కాశ్మీర్‌ మనది కాబట్టే అక్కడకు వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశంలో ఇక్కడ కూడా వద్దంటే మరి ఎక్కడికి పోవాలి. యుద్ధ పరిస్థితులు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృషించే వారి పట్ల అప్రమత్తంగా ఉండా సమగ్రంగా ఎదుర్కోవాలి’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కశ్మీర్ అనేది ఇప్పటికీ..ఎప్పటికీ భారతదేశంలో అంతర్గత భాగం. ఎప్పటికీ భాతర దేశంలో కశ్మీర్ అనేది అంతర్గత భాంగానే ఉంటుంది. ఎందుకు ఇంత బలంగా దీనిపైన మాట్లాడుతున్నానంటే.. కశ్మీర్ అనేది కష్యప మహర్షి పేరు మీద ఏర్పడింది. దీనిని చాలా బలంగా నమ్మాలి.. విశ్వసించాలి.. బలంగా ఆచరించాలి..దీనిని వద్దనడానికి, లేదనడానికి వీల్లేదు అని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు తీవ్రంగానే సూచించారు. అమర్నాథ్ ఆలయం కానీ, కేరళలో శంకరాచార్య మఠం కానీ అలా వచ్చినవే. చిన్న గొడవ జరిగినా కూడా మనకు ఎందుకులే అని భావించకూడదు. చాలా అలెర్ట్ గా ఉండాలి. వెంటనే అలాంటి ఘటనలపై స్పందించాలి. ఇది జనసేన పార్టీ స్టాండ్ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతోనే సూచించారు.
Read More
Next Story