ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఆ ముగ్గురు ఐఏఎస్‌లు
x

ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఆ ముగ్గురు ఐఏఎస్‌లు

డీవోపీటీ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు రిలీవ్‌ అయ్యారు. తెలంగాణ సీఎస్‌కు రిపోర్ట్‌ చేశారు.


తెలంగాణ కేడర్‌కు అలాట్‌ అయి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కొనసాగిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఏపీ నుంచి రిలీవ్‌ అయ్యారు. బుధవారం ఇక్కడ నుంచి రిలీవ్‌ అయిన ఆ ముగ్గురు అధికారులు తెలంగాణ సీఎస్‌కు రిపోర్టు చేశారు. ఇప్పటి వరకు ఏపీలో కొనసాగిన జీ సృజన, ఎల్‌ శివశంకర్, హరికిరణ్‌లు తెలంగాణ కేడర్‌కు చెందిన వారు. ఏ రాష్ట్ర కేడర్‌కు అలాట్‌ అయ్యారో అదే రాష్ట్రంలో పని చేయాలని ఇటీవల డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 16 నాటికి తెలంగాణ సీఎస్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. డీవోపీటీ ఆదేశాను సారం ఆ ముగ్గురు అధికారులు ఏపీ నుంచి రిలీవై తెలంగాణకు సీఎస్‌కు రిపోర్టు చేశారు. అయితే తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆ ముగ్గురు అధికారులు కోరారు.

గత వారంలో సీఎంను కలిసి డీవోపీటీ ఆదేశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు కేంద్రంతో మాట్లాడుతానని, ఏపీలోనే కొనసాగేలా చూస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు. దీంతో వారు ముగ్గురు ఏపీలోనే కొనసాగుతారనే టాక్‌ అధికార వర్గాల్లో సాగింది. ఒక పక్క డీవోపీటీ ఆదేశాలు, మరో పక్క సీఎం చంద్రబాబు హామీల నేపథ్యంలో ఆ ముగ్గురి రిలీవ్‌లపై అధికార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే డీవోపీటీ ఆదేశాలను అధికారులు పాటించక తప్ప లేదు. ముఖ్యమంత్రి, ప్రధానితో మాట్లాడారా? ఎవరుంటే నాకేమని భావించారా? అనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ల్లో జరిగింది. సీఎం అనుకుంటే తప్పకుండా వారు ఏపీలోనే ఉండేవారు. పైగా అందులో ఇద్దరు జిల్లా కలెక్టర్లుగా పని చేస్తున్నారు. ఐఏఎస్‌ అంటేనే జిల్లా కలెక్టర్‌గా చదువు రాని వారు ఎక్కువ మంది భావిస్తుంటారు. పైగా జిల్లాల్లో అన్ని శాఖలపై కలెక్టర్‌ అజమాయిషీ ఉంటుంది. అటువంటిది కలెక్టర్‌ గిరీని కూడా వారు వదులుకొని వెళ్లక తప్పలేదు. రాజకీయ నాయకులనే వాళ్లు ఎవరైనా తనకు అవసరమైనంత వరకు వాడుకుంటారని, ఆ తర్వాత ఎవరినీ పట్టించుకోరని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడవడం పలువురిని ఆలోచింప చేసింది.

Read More
Next Story