లోకేష్ చెప్పిన కంపెనీ ఇదే
x

లోకేష్ చెప్పిన కంపెనీ ఇదే

రీన్యూ పవర్ ₹82 వేల కోట్ల పెట్టుబడితో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.


మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి గురువారం ఉదయం ఎక్స్‌ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. లోకేష్ చెప్పిన విధంగా ఆయన గురువారం ఉదయం ఏపీకి రాబోయే భారీ పెట్టుబడి ఏంటో రివీల్ చేశారు. ఏపీలో రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రీన్యూ పవర్ పెట్టుబడులు పెడుతోందన్నారు. పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను రీన్యూ పవర్ నెలకొల్పనున్నట్లు మంత్రి వెల్లడించారు.

లోకేష్ ట్వీట్ లో ఏమన్నారంటే... ‘రీన్యూ పవర్ ₹82,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోకి తిరిగి అడుగుపెడుతోంది. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్న రీన్యూ పవర్ పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. సోలార్ ఇంగాట్ & వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉంది’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Read More
Next Story