ఏపీ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
x

ఏపీ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న 10 మెడికల్‌ కళాశాలలను పీపీపీ మోడ్‌లో డెవలప్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆయుష్మాన్‌ భారత్‌ – పీఎంజేఏవై డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్‌ మోడ్‌లో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ రూపకల్పనకు భీమా కంపెనీల నుండి టెండర్లను పిలవడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రతిపాదనల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 5.00 కోట్లు మందికి నాణ్యమైన వైద్య సేవలు అందజేయబడతాయి. ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత మరియు ఆర్థిక రక్షణను బలోపేతం చేసేందుకు బీమా ద్వారా కుటుంబానికి సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు మరియు ట్రస్ట్‌ ద్వారా రూ. 2.5 లక్షలకు మించి రూ. 25 లక్షల వరకు కవరేజ్‌ను దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు అందించడం మరియు దారిద్య్ర రేఖకుఎగువున ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి రూ. 2 లక్షల నుండి కుటుంబానికి 5 లక్షల వరకు బీమా కవరేజ్‌ను అందించడం ద్వారా బలోపేతం చేయబడుతుంది. వర్కింగ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పధకం క్రింద ఉన్న జర్నలిస్టులకు కూడా ఈ పథకం క్రింద వైద్య సేవలు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రూ.25 లక్షల వైద్య సేవలకు సంబందించిన చెల్లింపులు కూడా భీమా కంపెనీలే ప్రాసెస్‌ చేసి చెల్లించడం జరుగుతుంది. తదుపరి సంబందిత కంపెనీలకు ప్రభుత్వం రీ–ఇంబర్ముమెంట్‌ చేయడం జరుగుతుంది. ఈ పధకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందజేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో కేవలం 169 వైద్య సేవలే రిజర్వు చేయడం జరిగితే, ఇప్పుడు 324 వైద్య సేవలను అందజేయడం జరుగుతుందన్నారు.

పీపీపీ మోడ్‌లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల మరియు పార్వతీపురంలలో 10 కొత్త వైద్య కళాశాలలలను అభివృద్ధి చేయాలని మంత్రి మండలి ఆమోదించింది. ఈ 10 వైద్య కళాశాలల్లో 2027–28 విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్లు జరిగే విధంగా ఈ కళాశాలల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాజధాని నగరం అమరావతిలో భూమిని కేటాయించిన విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం/లీజు మరియు లీజు/అమ్మకం డీడ్ల ఒప్పందాలను అమలు చేసేటప్పుడు రీయింబర్స్‌మెంట్‌ ప్రాతిపదికన స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
31.08.2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 59,375 అనధికార నిర్మాణాలు, 49,936 డివియేషన్సు, 10,212 అదనపు అంతస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటన్నింటినీ క్రమబద్దీకరించడానికి ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రూ.427 కోట్ల పెట్టుబడితో మదర్‌ డైరీ ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి ఆమోదం తెలిపింది. గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గంపేట, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గోపాలపురం మరియు తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో రూ.5714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మేజర్‌–మైనర్‌)వరద నష్ట మరమ్మతులు చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ఉప సమూహాలలో షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణను అమలు చేయడానికి, సమాజంలో వారి ఏకీకృత, ఏకరీతి పురోగతిని నిర్ధారించడానికి, శాసనసభలో ప్రవేశపెట్టబోయే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రీన్‌ఫీల్డ్‌ , బ్రౌన్‌ఫీల్డ్‌ విశ్వవిద్యాలయాలు రెండింటికీ డిగ్రీల తప్పనిసరి ఉమ్మడి «ధృవీకరణ అవసరాన్ని తొలగించి, రాష్ట్రంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను నియంత్రించే నియంత్రణ చట్టసభ్య వ్యవస్థను క్రమబద్ధీకరించే దృష్టితో, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2016న్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ నియమావళుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపన వల్ల మెరుగైన విద్యా ప్రమాణాలు, ఆర్థిక వద్ధి మరియు మెరుగైన పరిశోధనా సామర్థ్యాలు వంటి ప్రయోజనాలు కలుగుతాయి. అమరావతి రాజధాని నగరంలోని అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతం కోసం లేఅవుట్లలో ట్రంక్‌ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్‌ – ఐఇఖీ కోసం యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ వాటర్‌లైన్‌ –అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
థర్డ్‌ పార్టీల ఆక్రమణలో ఉన్న వ్యక్తులకు సంబంధించి అదనపు భూముల క్రమబద్ధీకరణ/కేటాయింపు ఆమోదం కోసం రెవిన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎత్తైన నివాస భవనాల గరిష్ట ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుండి 24 మీటర్లకు పెంచడం కోసం రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదం తెల్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ శ్లాబుల మర్పును రాష్ట్ర మంత్రి మండలి సాగతిస్తూ, వారికి అభినందలు తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
Read More
Next Story