ఏపీలో జిల్లాల బీజేపీ అధ్యక్షులు వీరే
x

ఏపీలో జిల్లాల బీజేపీ అధ్యక్షులు వీరే

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించి జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసినట్లు బీజేపీ తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో బలం పుంజుకునేందుకు బీజేపీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తన క్యాడర్‌ను పెంచుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కూటమి భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ, జనసేనలు గ్రామ స్థాయిలో తమ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను తెరపైకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలను పూర్తి చేసి.. ఏపీలో తమకు తిరుగులేదని కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు హింట్‌ ఇచ్చింది. అయితే జనసేన ఇది వరకే తమ సభ్యత్వ కార్యక్రమాలను చేపట్టినా.. ఆశించిన స్థాయిలో సభ్యత్వ నమోదును పూర్తి చేయలేక పోయారని ఆ పార్టీ పెద్దలు అసంతృప్తిలో ఉన్నట్లు జనసేన శ్రేణుల్లో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి భాగస్వామి అయిన బీజేపీ తన కేడర్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ సిస్టర్‌ వింగ్‌ అయిన విశ్వహిందూపరిషత్‌ విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఇటీవల నిర్వహించిన హిందూశంఖారావం సభ సక్సెస్‌ కావడంతో బీజేపీ తమ కార్యక్రమాల దూకుడును పెంచింది.అందులో భాగంగా తొలుత జిల్లాల అధ్యక్షుల ఎంపికను కొలిక్కి తెచ్చింది. ఆ పార్టీ పెద్దలు రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వారికి అభినందనలు తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా మఠం శాంతకుమారి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా సిరిపురం తేజేశ్వరరావు, విజయనగరం జిల్లా అధ్యక్షులుగా ఉప్పలపాటి రాజేశ్‌ వర్మ, విశాఖపట్నం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా మంతెన పరుశురాంరాజును నియమించింది. అనకాపల్లి జిల్లాకు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కాకినాడ జిల్లాకు బిక్కిన విశ్వేశ్వరరావు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు అడబాల సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లాకు వినంపూడి శ్రీదేవి, ఏలూరు జిల్లాకు చౌటపల్లి విక్రమ్‌ కిశోర్, ఎన్టీఆర్‌ జిల్లాకు అడ్డూరి శ్రీరామ్, గుంటూరు జిల్లాకు చెరుకూరి తిరుపతిరావు, పల్నాడు జిల్లాకు ఏలూరు వెంకటర మారుతి శశికుమార్, ప్రకాశం జిల్లాకు సెగ్గం శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు పారెడ్డి వంశీధర్‌రెడ్డి, తిరుపతి జిల్లాకు సామంచి శ్రీనివాసరావు, అన్నమయ్య జిల్లాకు వసంత సాయిలోకేష్, చిత్తూరు జిల్లాకు సూరపనేని జగదీశ్వర్‌ నాయుడు, కడప జిల్లాకు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, సత్యసాయి జిల్లాకు గోరంట్ల మోహన్‌ శేఖర్, అనంతపురం జిల్లాకు కొనకొండ్ల రాజేశ్, కర్నూలు జిల్లాకు బాపురం రామకృష్ణ పరమహంస, నంద్యాల జిల్లాకు అభిరుచి మధులను అధ్యక్షులుగా నియమించారు.
Read More
Next Story