అమరావతిలో కొలువుదీరే 15 బ్యాంకులు ఇవే
x

అమరావతిలో కొలువుదీరే 15 బ్యాంకులు ఇవే

రూ.1,334 కోట్లతో ఈ కార్యాలయాలు నిర్మిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ముందడుగు పడుతోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. 15 బ్యాంకులు, బీమా సంస్థలు ఈ మేరకు భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నాయి. వీటికి శుక్రవారం ఉదయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, LIC, New India Assurance company ltd (NIACL) తమ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తున్నాయి. రూ.1,334 కోట్లతో ఈ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయా బ్యాంకుల, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు.

Read More
Next Story