
సంక్షేమ హాస్టళ్లు కాదు.. విద్యార్థుల పాలిట నరకకూపాలు!
ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్నిఆదేశిస్తూ, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
"రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులు నివసించడానికి యోగ్యంగా ఉన్నాయా లేక నరకకూపాలుగా మారాయా?" అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు మంజూరవుతున్నా క్షేత్రస్థాయిలో కనీస వసతులు కల్పించడంలో వైఫల్యం చెందడంపై అసహనం వ్యక్తం చేస్తూ, మనుషులు ఉండలేని పరిస్థితుల్లో విద్యార్థులను ఉంచడం అమానుషమని వ్యాఖ్యానించింది. కొత్త ఏడాది మొదటి రోజైన 2026, జనవరి 1 (గురువారం) నాడు జరిగిన ఈ విచారణలో, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ హస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలపై కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించిన ప్రధానాంశాలు..

