Telangana|ఈ స్కూల్లో ఒకే స్టూడెంట్..ఒకే టీచర్
x

Telangana|ఈ స్కూల్లో ఒకే స్టూడెంట్..ఒకే టీచర్

ఈ స్కూలులో ఒక స్టూడెంటుకు ఒక టీచర్ ను కేటాయించిన ప్రభుత్వం ఎంత గొప్పో అనుకునేరు. స్కూలు మొత్తంలో చదువుతున్నది ఒకే స్టూడెంట్ చదువు చెబుతున్నది కూడా ఒకరే టీచర్.


కొన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధులు ఎక్కువైపోయి టీచర్లు తక్కువమంది ఉంటారు. మరికొన్ని స్కూళ్ళల్లో పిల్లలు తక్కువగానే దామాషాకు మించి టీచర్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మరికొన్ని స్కూళ్ళల్లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా విద్యార్ధులందరినీ దగ్గరలోనే ఉన్న ఇంకో స్కూలుకు సర్దుబాటు చేసి, టీచర్లను కూడా ఇతర స్కూళ్ళకు బదిలీచేస్తుంది. పరిస్ధితిలో ఎలాంటి మార్పులు రాకపోతే సదరు స్కూలును కొంతకాలం తర్వాత మూసేస్తుంది. పై విషయాలన్నీ మనకు అందరికీ తెలిసిందే. అయితే ఖమ్మం జిల్లాలోని ఒక స్కూలు విచిత్రమైన పరిస్ధితుల్లో నడుస్తోంది. ఇంతకీ ఆ విచిత్రం ఏమిటో తెలుసా ? స్కూలు మొత్తానికి ఉన్నది ఒకే స్టూడెంట్. ఆ ఒక్క స్టూడెంటుకు చదువుచెబుతున్నది కూడా ఒకే టీచర్. ఈ స్కూలులో ఒక స్టూడెంటుకు ఒక టీచర్ ను కేటాయించిన ప్రభుత్వం ఎంత గొప్పో అనుకునేరు. స్కూలు మొత్తంమీద చదువుతున్నది ఒకే స్టూడెంట్..చదువు చెబుతున్నది కూడా ఒకరే టీచర్.



అంటే ఈ స్కూలు మొత్తానికి ఉన్నది ఒక టీచర్, ఒక స్టూడెంట్ మాత్రమే. ఖమ్మం జిల్లా(Khammam District), వైరామండలం(Wyra Mandal)లో నారపనేనిపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాలుంది. ఈ స్కూలులో 1 నుండి 7వ తరగతి వరకు చదువుకునే అవకాశముంది. అలాంటిది 2024-25 విద్యా సంవత్సరం ఆరంభం నుండి స్కూలులో ఒకే స్టూడెంట్ ఉంటే ఆ అమ్మాయికి పాఠాలు చెప్పేందుకు ఉన్నది కూడా ఒక టీచర్ మాత్రమే. ఈ టీచరే స్టూడెంట్ కు అన్నీ సబ్జెక్టులు చెబుతున్నారు. ఇంగ్లీషు సబ్జెక్టు చెప్పే ఎస్జీటీ టీచర్ బలివాడ ఉమా పార్వతి వేరే టీచర్లు ఎవరూ లేకపోవటంతో స్టూడెంట్ కీర్తనకు తానే అన్నీ సబ్జెక్టులను బోధిస్తున్నారు. కారణాలు తెలీదుకాని మొదటినుండి ఈ స్కూలులో విద్యార్ధుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. ఎప్పుడో 15 ఏళ్ళక్రితం సుమారు 200 మంది విద్యార్ధులు ఉండేవారు. తర్వాత నుండి ప్రతి ఏడాది విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతోంది.



2023-24 విద్యాసంవత్సరంలో స్కూలు మొత్తానికి ఐదుగురు విద్యార్ధులు మాత్రమే ఉండేవారు. పరీక్షలు అయిపోగానే ఉన్న నలుగురిలో ఇద్దరు గురుకుల పాఠశాలకు మరో ఇద్దరు విద్యార్ధులు ప్రైవేటు స్కూలులో చేరిపోవటంతో చివరకు మిగిలింది 4వ తరగతి చదువుతున్న కీర్తన మాత్రమే. ఈ పిల్ల తండ్రి కీర్తను వేరే స్కూలులో చేర్పించటం ఇష్టంలేక ప్రభుత్వ స్కూలులోనే ఉంచేయటంతో స్కూలులో ఈ ఒక్క అమ్మాయి అయినా మిగిలింది. స్కూలులో ఒక్క స్టూడెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఒక్క టీచర్ ను కంటిన్యు చేస్తోంది. ఇపుడు పనిచేస్తున్న ఉమ ఆరేళ్ళ నుండి ఇదే స్కూలులో పనిచేస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో టీచర్లు కూడా బదిలీపై వెళ్ళిపోవటం లేకపోతే తామే బదిలీ చేయించుకుని వెళ్ళిపోగా చివరకు మిగిలింది ఉమా పార్వతి మాత్రమే. అందుకనే ‘టీచర్ కు స్టూడెంట్..స్టూడెంట్ కు టీచర్’ గా స్కూలు రికార్డుల్లోకి ఎక్కింది.



ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధులు ఎక్కువగా చేరకపోవటానికి లేదా తగ్గిపోవటానికి కారణాలు ఉన్నాయి. అవేమిటంటే తల్లి, దండ్రుల్లో మార్పు. మార్పు ఏమిటంటే అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో(Private Schools) చదివించాలని అనుకుంటారే కాని ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించటాన్ని అవమానంగా ఫీలవుతుంటారు. అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో(Government Schools) టీచర్లంటే చాలామందిలో చిన్నచూపుంటుంది. నిజానికి సబ్జెక్టు నాలెడ్జిలో చాలామంది ప్రభుత్వ టీచర్లు చాలామంది ప్రైవేటు టీచర్లకన్నా మెరుగైన స్ధితిలో ఉంటారు. అయితే ఉద్యోగభద్రత కారణంగా చాలామంది ప్రభుత్వ టీచర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. చదువుచెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అడిగేవారు ఉండరన్న నిర్లక్ష్యంతోనే పిల్లలకు సరిగా పాఠాలు చెప్పరు. ఇదే సమయంలో పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పే టీచర్లు కూడా ఉంటారు. బాధ్యతతో పిల్లలకు చదువుచెప్పే ప్రభుత్వ టీచర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. అదే ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలకు సరిగా చదువుచెప్పకపోయినా, సిలబస్ పూర్తిచేయకపోయినా, టైం ప్రకారం స్కూలుకు రాకపోయినా, రిజల్టు తక్కువగా వచ్చినా సదరు టీచర్ ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగం పోతుందనే భయంతో ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్లు ప్రతిరోజు స్కూళ్ళకు వచ్చి పాఠాలు చెబుతారు. ఫలితాలు కూడా అలాగే వస్తాయి కాబట్టే తల్లి, దండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించటానికే మొగ్గు చూపుతుంటారు.


ఇపుడు నారపునేనిపల్లిలో జరిగింది కూడా ఇదే. ఇదే ఊరిలో ఉన్న ఒక ప్రైవేటు స్కూలు, మరో మిషినరీ స్కూలు(Missionary School) పిల్లలతో కళకళలాడుతుంటే ప్రభుత్వ స్కూలు మాత్రం ఎందుకు వెలాతెలాపోతోంది ? ఈ విషయమై విద్యాశాఖ అధికారులందరు మనసుపెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ స్కూలులో చేరాలంటే 5 ఏళ్ళు నిండాల్సిందే లేకపోతే చేర్చుకోరు. అదే ప్రైవేటు స్కూళ్ళ యాజఃమాన్యాలు ప్రీ కేజీ అని ప్రీప్రైమరీ అని మూడేళ్ళు నిండిన పిల్లలను కూడా చేర్చేసుకుంటున్నాయి. అందుకనే తల్లి, దండ్రులు తమ పిల్లలను ఆ స్కూళ్ళలోనే కంటిన్యు చేస్తున్నారు. ఇపుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో మూడో క్లాసు వరకు చదివిన పిల్లలు నాలుగో తరగతి ఎంట్రన్స్ పరీక్షలు రాసి గురుకుల పాఠశాలల్లో చేరటానికి ఎక్కువ ఆశక్తి చూపుతున్నారు. ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో అయితే భోజన, వసతి సౌకర్యాలు ఉంటున్నాయి. అందుకనే తల్లి, దండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పించటానికి ఎక్కువ ఆశక్తి చూపుతున్నారు. నారపనేనిపల్లిలో సుమారు 300 ఇళ్ళున్నా పట్టుమని 30 మంది విద్యార్ధులు కూడా ప్రభుత్వ స్కూలులో చదవటంలేదంటే కారణాలు ఏమయ్యుంటాయో విద్యాశాఖ ఆలోచించాల్సిందే.

Read More
Next Story