తీర్పు మార్చేది లేదు..కావాలంటే హైకోర్టుకెళ్లండి
x

తీర్పు మార్చేది లేదు..కావాలంటే హైకోర్టుకెళ్లండి

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందరరెడ్డి కస్టడీ విషయంలో కడప కోర్టు పోలీసులపై సీరియస్‌ అయ్యింది.


పోలీసుల తీరు కడప కోర్టుకు ఆగ్రహం తెప్పించింది. ఇది వరకు ఇచ్చిన తీర్పుపై మళ్లీ పిటీషన్‌ దాఖలు చేయడంపై సీరియస్‌ అయ్యింది. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందరరెడ్డి కస్టడీ విషయంలో 10 రోజులు అడిగితే రెండు రోజులకు మాత్రమే కడప కోర్టు సమయం ఇచ్చింది. రెండు రోజులు చాలవంటూ తీర్పు మార్చాలనని కోరుతూ పోలీసులు పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపైన సీరియస్‌ అయిన జిల్లా జడ్జి.. తీర్పు మార్చేది లేదని..కావాలంటే హైకోర్టుకెళ్లాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వర్రా రవీందరరెడ్డి పోలీసుల కస్డడీలో ఉన్నాడు. శుక్రవారం, శనివారాల్లో మాత్రమే వర్రాను విచారణ చేయాల్సి ఉంటుంది. తర్వాత విశాఖ జైలుకు తరలించాల్సి ఉంటుంది. అయితే వర్రాను విశాఖ జైలు నుంచి కడపకు తీసుకొచ్చి, తిరిగి వైజాగ్‌లో దింపేందుకే రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని, ఇక విచారణకు సమయం ఎలా సరిపోతుందని కడప పోలీసులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.


Read More
Next Story