సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు: సజ్జల
x

సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు: సజ్జల

రుషికొండపై ఉన్న భవనం వైఎస్‌ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండని సజ్జల అన్నారు.


చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక మాఫీయా ఏపీలో రాజ్యం ఏలుతోందని విమర్వించారు. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, వీటిని మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా కూటమి నాయకులు అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు వైఎస్‌ఆర్‌సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు విష ప్రచారం చేశారని అన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ కట్టడాలు చేయలేదన్నారు. కరకట్ట అక్రమ కట్టడంలో సీఎం చంద్రబాబు ఉంటున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ కట్టించిన రుషికొండ భవనాలు చూసి సంతోషపడిన సీఎం చంద్రబాబు, వాటిని వైఎస్‌ జగన్‌ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండపై ఉన్న భవనం వైఎస్‌ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండని అన్నారు.
ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తన తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ భవనాలు చూస్తే సీఎం చంద్రబాబు పాలన అర్థం అవుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ చేసిన వేల కోట్ల సంక్షేమంతో పోల్చుకోగలవా సీఎం చంద్రబాబు? అని ప్రశ్నించారు. ఏపీలో సూపర్‌ సిక్స్‌ ఎక్కడా అమలు లేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రతీరోజు అప్పు చేస్తున్నారని, ఈ ఐదు నెలల్లో రూ. 53వేల కోట్లు అప్పు చేశారని అన్నారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయన్నారు. 2027 లోనే జమీలి ఎన్నికలు రాబోతున్నాయని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఐక్యమే మన బలం, మన ఆయుధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రజలే తొక్కి తాట తీస్తారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
Read More
Next Story