అప్పుడే జగన్‌ పాపం పోతుంది
x

అప్పుడే జగన్‌ పాపం పోతుంది

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ జగన్‌పై ధ్వజమెత్తారు.


ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అలా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని, అలా చేసినప్పుడే జగన్‌ చేసిన పాపం పరిహారం అవుతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మీద దొమ్మీలు చేస్తూ జగన్‌ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్‌ యాత్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మద్యంతో పాటు ఇసుకలో కూడా పెద్ద స్కామ్‌ జరిందన్నారు. సిట్‌ అధికారులు తనను విచారణకు పిలిస్తే మాత్రం ఆ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు అందిస్తానని వెల్లడించారు.

Read More
Next Story