పరీక్షలు పూర్తయ్యాయి–పని చేయకపోతే మంచి ఫలితాలు రావు
x

పరీక్షలు పూర్తయ్యాయి–పని చేయకపోతే మంచి ఫలితాలు రావు

ఆటో డ్రైవర్లకు కూడా రూ.15 వేలను అక్టోబరు 1 తేదీన ఇస్తామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి అయిపోయాయి, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చింది, ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావు అని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ తొలి రోజు ప్రారంభంలో ఆయన మాట్లాడారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్‌ వర్క్‌ చేయాల్సిందే అని కలెక్టర్లకు సూంచించారు. వాట్సప్‌ గవర్నెన్సు ద్వారా పౌరసేవలు అందిస్తున్నాం. ఏఐ, డేటా లేక్‌ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి అని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్‌ సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు. విజన్‌ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్‌ సిక్స్‌ను సక్సెస్‌ చేశాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్ధికి ఆర్ధికసాయం చేస్తున్నాం. ఏడుగురు పిల్లలు ఉన్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేశాం. ఆ కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. విద్యార్ధులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయని అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు...కానీ స్త్రీశక్తి పథకం సఫలమైంది. 50 శాతం మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయి. పనిచేయగల వారిని సమర్ధంగా వినియోగించుకుంటే జీఎస్డీపీ పెరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం–స్త్రీశక్తి పథకం ఆర్ధిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుంది. పథకం అమలు తర్వాత 90 శాతం మేర ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా అని పేర్కొన్నారు. దీపం2 పథకం ద్వారా మూడు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.7 వేల రూపాయలు ఇచ్చాం. మూడు విడతల్లో రూ.20 వేలు ఆర్ధిక సాయం అందిస్తాం. ఆటో డ్రైవర్లకు కూడా రూ.15 వేలను అక్టోబరు 1 తేదీన ఇస్తాం. పీపీపీ విధానంలో పోర్టులు, ఇన్ఫ్రా పెరిగింది. ఆర్ధిక అసమానతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. సమాజంలోని అన్ని ప్రాంతాల్లోనూ అవకాశాలు రావాలి...ప్రతిఫలాలు అందాలి అని సూచించారు.
గతంలో రాయలసీమ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ప్రాంతం..ఇప్పుడు కోనసీమతో సమానంగా ఉంది. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడైతే అందులో ఏపీవాళ్లే ఎక్కువ ఉన్నారు. రాయలసీమలో డ్రిప్‌ ఇరిగేషన్‌ లాంటి విధానాలతో సమర్ధనీటి నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువను 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లాం. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వధాగా పోతున్నాయి. సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపాం. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలి. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్‌గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి. ఐదేళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్సులు, 125 కేబినెట్‌ సమావేశాలు, ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read More
Next Story