మన మధ్యే మహాత్ముడి గుడి
x

మన మధ్యే మహాత్ముడి గుడి

దేశంలో మహాత్మా గాంధీకి అనేక చోట్ల దేవాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గాంధీకి దేవాలయం కట్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఆ ఊరు ఎక్కడుంది?


స్వరాజ్య సాధనలో గాంధీ నడిచిన బాట అందరికీ తెలుసు. ఆయన నడిచిన బాటలో నేటి యువత నడవాలంటే దేవుడి కంటే మిన్నగా పూజిస్తేనే అది సాధ్యమవుతుందని భావించిన ఓ వక్యి గాంధీజీ పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించి గాంధీకి గుడి కట్టించి నిత్యం పూజలు చేయిస్తున్నారు. ఆంధప్రదేశ్ లోని ఓ పట్టణంలో ఈ గుడి ఉంది. ఈ గుడి గురించి గాంధీ జయంతి రోజున తెలుసుకోవడం మన కర్తవ్యంగా భావిద్దాం...

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో బాపూజీ గుడిని ఓ ట్రస్ట్ నిర్మించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి భక్తులకు గాంధీ మహ్మాతుడి దర్శనానికి స్వరం సిద్ధం చేసింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్నివర్గాల వారు గాంధీజీ ఆశీస్సులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్‌ అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి తెలిపారు.

వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి, జయంతి, వర్దంతి రోజున దండలు వేసి దండం పెట్టుకోవడం కాకుండా అనునిత్యం మహాత్మా గాంధీని స్మరించుకునేందుకు వీలుగా ఈ గాంధీ గుడిని నిర్మించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గాంధీ అనే రెండు అక్షరాలకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం, గౌరవం ఉందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.

మహాత్మా గాంధీ ముందు తరం వరకూ పోరాటంలో గెలవాలన్నా, యుద్ధంలో నెగ్గాలన్నా రక్తం చిందించాల్సిందేనని, ప్రాణాలను బలి ఇవ్వాల్సిందేనని, ఆ ఒరవడికి ముగింపు పలికిన మహానేత గాంధీ అని తెలిపారు. హింసకు చరమగీతం పాడుతూ, అహింస మార్గంలోనూ అనుకున్నది సాధించవచ్చునని నిరూపించిన గొప్ప మార్గదర్శిగా గాంధీని అభివర్ణిస్తున్నారు. ఆయన మార్గాన్ని అనుసరించేలా యువతను ప్రోత్సాహించేందుకు ఈ గుడిని వారధిగా ఎంచుకున్నామనేది నిర్వాహకుల మాట.

స్వాతంత్య్ర సాధన ద్వారా సరికొత్త చరిత్ర లిఖించిన జాతిపితను దేవుడిగా పూజించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళిగా ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అందుకే మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేకంగా ఏకశిలను తెప్పించి, దుర్గిలోని నాగార్జునలో శిల్పం తయారు చేయించినట్లు చెబుతున్నారు. నిత్యం గాంధీ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు, భావితరాలకు మహ్మాతుడి ఉద్యమస్ఫూర్తిని తెలిపే విధంగా తమ ప్రాంతంలో ఆలయం నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాత్ముడి జయంతిని పురస్కరించుకొని వేడుకలు జరుపుతున్నారు.

దేశంలో రామాలయం లేని ఊరు, గాంధీ మహ్మాతుడి విగ్రహం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లోనూ గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకుంటున్నాం. విశ్వమంతా ఖ్యాతిని సొంతం చేసుకున్న ఆ మహానీయుడిని వీధుల్లోని విగ్రహాలకే పరిమితం చేయకుండా, దేవుడిలా కొలవాలనే తలంపుతో గాంధీ ఆలయాన్ని కట్టించింది

Read More
Next Story