
భారతీయ సాహిత్యంలో ’తెలుగు కథ’ది వైవిధ్యమైన పాత్ర
కేంద్ర సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో 75 ఏళ్ల తెలుగు కథ అంశంపై సదస్సు నిర్వహించారు.
భారతీయ సాహిత్యంలో ‘తెలుగు కథ’ వైవిధ్య పాత్ర పోషించిందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 75 ఏళ్ల తెలుగు కథ అంశంపై సదస్సు కర్నూలు నగరంలోని లలిత కళా సమితిలో ఆదివారం ఉదయం నిర్వహించారు. సభను ప్రారంభించిన ఆయన సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 నుంచి 2022 వరకు తెలుగు చిన్న కథలలో అనేక మార్పులు, పరిణామాలు వచ్చాయని, ఇవి సమాజాన్ని తీవ్ర ప్రభావితం చేశాయన్నారు.
సభకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర మాట్లాడుతూ సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా భాషా సాహిత్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని, తొలి అధ్యక్షులుగా నెహ్రూ పనిచేశారని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీకి రాజకీయ అతీతమైన భావజాలం ఉందని అన్నారు. ప్రగతిశీల విప్లవ కథలు అంశంపై కే నాగేశ్వరావు చారి మాట్లాడుతూ.. సీరియస్ రచయితల కథలు తెలుగు కథ నేల విడిచి సాము చేయలేదని, పత్రిక కథలు మినహా కరుణకుమార కథలు జాతీయ ఉద్యమం సామాజిక చైతన్యం తెలంగాణ ఎర్రజెండా గంగినేని వెంకటేశ్వరరావు మూడు సంపుటాలు విప్లవోద్యమం నిర్వచనాలన్నారు. కథలు కాలాన్ని బట్టి మారుతాయని, త్రిపురనేని మధుసూదనరావు కథ ఫోటోగ్రఫీలా ఉండాలని సూచించారు.
కురాడి చంద్రశేఖర కల్కూర
దళిత డిప్రెషన్ క్లాస్, అంబేద్కర్ దళితుల కంటే బీసీలు సమాజంలో ఎక్కువ శ్రమ దోపిడీకి గురయ్యారన్నారు. నారాయణస్వామి బిఎస్ రాములు కథల్లో అవమానం, అనుభవం చెప్పాల్సిన విషయాలు ఒక వృత్తంలో వలయాలు ఏర్పరచడం వంటివి సృష్టించారని అన్నారు. 144 బీసీ కులాలు తెలంగాణ పొలం రాజు కథ, ఇలాంటివి దళిత కథలు శ్రీపాద, గిరిజన కథ మళ్లీపురం జగదీష్ ఎరుకలు కథ పలమనేరు బాలాజీ తెలుగు కథ నేల విడిచి సామ చేయలేదన్నారు.

