నాయకుల నోరు మూయించిన సుప్రీం కోర్టు
x

నాయకుల నోరు మూయించిన సుప్రీం కోర్టు

టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు లడ్డూ వ్యవహారంపై నోరెత్తడం లేదు. సుప్రీం కోర్టు వీరి నోటికి తాళం వేసింది.


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల నోళ్లు ఉన్నట్టుండి మూత పడ్డాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని పది రోజులుగా నానా యాగీ చేశారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. జనమంతా నాయకుల మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. నిజంగా లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారా? అదే లడ్లను మనం తిన్నామా? అంటూ ఊరూరా చర్చించుకున్నారు. సోమవారం అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటారా? అంటూ వ్యాఖ్యానించడంతో అన్ని పార్టీలు ఒక్క సారిగా ఆలోచనల్లో పడ్డాయి. హిందూ సంఘాలు ఘోరమంటూ మాట్లాడిన మాటలు ఒక్క సారిగా ఆపి వేశాయి. తెలుగుదేశం పార్టీ నోరు మెదప లేదు. వైఎస్‌ఆర్‌సీపీ సోమవారం ఉదయం మాట్లాడిన అధినితే ఆదేశాల మేరకు మధ్యాహ్నం నుంచి నోటికి తాళం వేసుకున్నారు. లడ్డూ వ్యవహారంపై ఒక్క సారిగా నిశ్శబ్దం నెలకొంది. ప్రభుత్వ దర్యాప్తు కూడా నిలిచిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందరూ అక్టోబరు మూడో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీం కోర్టులో దీనిపై తిరిగి విచారణ జరుగుతుంది.

Read More
Next Story