సకల వేదాలకు మూలం.. గాయత్రీదేవి దర్శనం..
x
ఫొటోలు- రవి పెదపోలు

సకల వేదాలకు మూలం.. గాయత్రీదేవి దర్శనం..

విజయవాడ దుర్గగుడిలో అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనం ఇచ్చారు.


విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనం ఇచ్చారు.

భక్తుల తాకిడీ పెరిగింది. వేలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కొండ దిగువన వినాయక ఆలయం, కుమ్మరిపాలెం దగ్గర నుంచి క్యూలైన్లు సాయంత్రం సమయంలో రద్దీగా కొనసాగాయి.
గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి దేవి. సకల వేదాలకు మూలం అయిన గాయత్రీదేవిని పూజిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

హేమ, నీల, ధవళ, ముక్త, విద్రుమ అనే 5 ముఖాలతో..శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది గాయత్రి అమ్మవారు.

ప్రాతఃకాలంలో గాయత్రిగా..మధ్యాహ్నం సావిత్రిగా...సాయం సంధ్యలో సరస్వతిగా...మూడు సంధ్యలలో పూజలందుకుంటోంది గాయత్రి. గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని పురాణాల్లో ఉంది. ఈ ఉపాసన చేసేవారిలో బుద్ధి, తేజస్సు వృద్ధి చెందుతుంది.

గాయత్రి మంత్ర జపం, అమ్మవారి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శం నాలుగు వేదాలు పారాయణం చేసినంత ఫలితాన్నిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రెండో రోజు గాయత్రి అలంకారం...అంటే..నవదుర్గల్లో చంద్రఘంట అని పిలుస్తారు. శ్రీశైలంలో భ్రమరాంబిక చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది.

ఇంట్లో పూజలు చేసేవారు కూడా కొందరు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలను అనుసరిస్తే.. మరికొందరు నవదుర్గల ప్రకారం పూజ చేస్తారు.
ఈ రోజు అమ్మవారికి పులిహోర, కొబ్బరి అన్నం నివేదిస్తారు.
Read More
Next Story