కాపు కార్పొరేషన్ పేరును కాపు, బలిజ, తెలగ కార్పొరేషన్‌గా మార్చాలి
1982లో ఆవిర్భావం నుంచి టీడీపీని బలపర్తూ, నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నాం. ఎన్ని అవమానాలు ఎదురైనా అండగానే ఉన్నాం. నామినేటెట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ పేరును కాపు, బలిజ, తెలగ కార్పొరేషన్‌గా పేరు మార్చాలని ఆంధ్రప్రదేశ్ కాపు, బలిజ, తెలగ మహాసభ డిమాండ్ చేసింది. అలా పేరు మార్చిన తర్వాత గ్రేటర్ రాయలసీమకు చెందిన బలిజలకు ఆ కార్పొరేషన్ చెర్మన్ పదవి ఇవ్వాలని, ప్రతి జిల్లాలో ఇద్దరికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రేటర్ రాయలసీమలోని 6 ఉమ్మడి జిల్లాల్లో 2.40 కోట్ల జనాభా ఉంటే వారిలో 45లక్షలకుపైగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 1982లో ఆవిర్భావం నుంచి టీడీపీని బలపర్తూ, నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉందని, స్థానిక సర్పంచ్‌లు మొదలుకొని జడ్పీ చైర్మన్, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు చైర్మన్లు, డైరెక్టర్లు వంటి పోస్టుల్లో బలిజలకు రాజకీయ అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం చేకూర్చాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అవమనాలకు గురైనా టీడీపీని వీడ లేదని, గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేశారని పేర్కొన్నారు.