VONTIMITTA || వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం.
x

VONTIMITTA || వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం.

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.


ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు.


ఉదయం 10.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు.


అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Read More
Next Story