
ఏపీలో ఏటేటా పెరుగుతున్న ఆర్థిక భారం
ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు పన్నుల నుంచి వచ్చిన డబ్బు సరిపోక రూ. 47,806 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర సొంత పన్నులు గత ఏడాదితో పోలిస్తే 7.03 శాతం గ్రోత్‌తో మందగిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రానికి సొంత డబ్బు తక్కువగా వస్తుంది. కొత్త స్కీములు, రోడ్లు, ఆస్పత్రులు పెట్టడం కష్టం అవుతుంది. కేంద్రం నుంచి ఎక్కువ అప్పు లేదా గ్రాంట్లు అడగాల్సి వస్తుంది. రాష్ట్రం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తగ్గుతుంది.
కేంద్ర పన్నుల వాటా రూ.25,000 కోట్లకు మించి వచ్చినప్పటికీ మొత్తం రెవెన్యూ డెఫిసిట్ రూ.47,806 కోట్లకు చేరడంతో ఆర్థిక ఒత్తిడి కనిపిస్తోంది. రెవెన్యూ డెఫిసిట్ రూ. 47,806 కోట్లు అంటే ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు పన్నుల నుంచి వచ్చిన డబ్బు సరిపోక రూ. 47,806 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని అర్థం. ఇది ఆర్థిక ఆరోగ్యానికి చాలా ఆందోళనకర సిగ్నల్ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,66,573.09 కోట్ల పన్ను రాబడి అంచనా వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్టోబర్ 2025 నాటికి రూ.82,983.17 కోట్లు సాధించింది. ఇది వార్షిక అంచనాల 50 శాతానికి పైగా ఉంది. ఏడు నెలల్లోనే అధికారిక లక్ష్యాన్ని మించింది. అయితే కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) మంత్లీ కీ ఇండికేటర్స్ (అక్టోబర్ 2025) నివేదిక ప్రకారం, GST, సేల్స్ ట్యాక్స్ రాబడి 2.85 శాతం మాత్రమే పెరిగింది.
పన్నులపై 76 శాతం ఆధారం.. రూ.1.66 లక్షల కోట్ల లక్ష్యం
2025-26 బడ్జెట్‌లో మొత్తం రెవెన్యూ రిసిప్టులు రూ.2,18,002 కోట్లుగా అంచనా వేసిన ప్రభుత్వం, ఇందులో పన్ను రాబడి రూ.1,66,573.09 కోట్లు (76 శాతం) గా ప్లాన్ చేసింది. ఇది గత సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్‌కు 24 శాతం పెరుగుదల. రాష్ట్ర సొంత పన్నులు (State's own tax revenue) రూ.1,00,000 కోట్లకు పైగా కేంద్ర పన్నుల వాటా (Share in Central Taxes) రూ.50,000 కోట్లు, GST (State GST + IGST share) రూ.27,477 కోట్లు, స్టేట్ సేల్స్ ట్యాక్స్/వ్యాట్ రూ.25,000 కోట్లు అంచనా. ఫైనాన్స్ మంత్రి పయ్యావుల కేశవ్ మాటల్లో చెప్పాలంటే.., "స్వర్ణాంధ్ర 2047" లక్ష్యంతో పన్ను సేకరణను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
అయితే మొత్తం ఖర్చు రూ.3,22,359 కోట్లకు పైగా ఉన్నందున, పన్ను రాబడి లోపాలు అప్పులపై ఆధారపడటానికి కారణమవుతోంది. రెవెన్యూ డెఫిసిట్ 1.8 శాతం GSDP (రూ.33,186 కోట్లు)గా లక్ష్యం. కానీ CAG డేటా దాన్ని మించి చూపుతోంది.
అక్టోబర్ 2025 వరకు రాబడి, 50 శాతం అంచనా సాధన..
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు (ఏడు నెలలు) మొత్తం పన్ను రాబడి రూ.82,983.17 కోట్లు. ఇది వార్షిక లక్ష్యం కంటే 50 శాతం కు పైగా ఉంది. CAG మంత్లీ కీ ఇండికేటర్స్ ప్రకారం మొత్తం రెవెన్యూ రిసిప్టులు రూ.91,639 కోట్లు, ఇందులో పన్నులు ప్రధాన భాగం. రాష్ట్ర సొంత పన్నులు (Own Tax Revenue) 7.03 శాతం పెరిగి సెమీ-యాన్యువల్ (మొదటి 6 నెలలు) రూ.45,000 కోట్లకు చేరాయి.
GST, సేల్స్ ట్యాక్స్, కేంద్ర వాటా వివరాలు (CAG & GSTN డేటా ఆధారంగా)
GST: రూ.15,500 కోట్లు (స్టేట్ GST + IGST సెటిల్మెంట్). మొదటి 4 నెలల్లో 61 శాతం టార్గెట్ (రూ.16,800 కోట్లు) సాధించినప్పటికీ, మొత్తం GST + సేల్స్ ట్యాక్స్ YoY (Year on Year) 2.85 శాతం మాత్రమే పెరిగాయి. అక్టోబర్‌లో రూ.3,200 కోట్లు, కానీ Q1లో -9 శాతం డిక్లైన్.
స్టేట్ సేల్స్ ట్యాక్స్/వ్యాట్: రూ.12,000 కోట్లు. మొదటి 6 నెలల్లో 3.2 శాతం గ్రోత్, కానీ పెట్రోలియం ధరల మార్పుల వల్ల మందగింపు చోటు చేసుకుంది.
కేంద్ర పన్నుల వాటా: రూ.25,500 కోట్లు (కార్పొరేట్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ GST షేర్). మొత్తం కేంద్ర షేర్ BE 2025-26కి 40 శాతం సాధన, కానీ Q1లో 7.2 శాతం తగ్గింది. అంటే తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) GDP (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 7.2 శాతం తక్కువగా ఉందని అర్థం.
ఈ రాబడి వల్ల ఏడు నెలల్లో మొత్తం రెవెన్యూ రిసిప్టులు 50 శాతం అంచనా (రూ.1,09,001 కోట్లు) సాధించాయి. కానీ ఖర్చు రూ.1,39,445 కోట్లకు చేరడంతో డెఫిసిట్ పెరిగింది.
| పన్ను రకం | బడ్జెట్ అంచనా (2025–26 పూర్తి సంవత్సరం) | ఏడు నెలల రాబడి (ఏప్రిల్–అక్టోబర్ 2025) | బడ్జెట్‌లో % సాధన | YoY గ్రోత్ (గత ఏడాదితో పోల్చితే) |
| GST (స్టేట్ + IGST వాటా) | ₹27,477 కోట్లు | ₹15,500 కోట్లు | 56% | +2.85% |
| స్టేట్ సేల్స్ ట్యాక్స్ / పెట్రోల్-డీజిల్ VAT | ₹25,000 కోట్లు | ₹12,000 కోట్లు | 48% | +2.85% (GSTతో కలిపి మొత్తం) |
| కేంద్ర పన్నుల వాటా (Income Tax, Customs, Excise మొ.) | ₹50,000 కోట్లు | ₹25,500 కోట్లు | 51% | −7.2% (Q1లో గణనీయ కుదింపు) |
| మొత్తం పన్ను రాబడి | రూ. 1,66,573 కోట్లు | రూ. 82,983 కోట్లు | 50% | +7.03% (స్వంత పన్నులు మాత్రమే) |
(సోర్స్: CAG మంత్లీ కీ ఇండికేటర్స్ అక్టోబర్ 2025, PRS బడ్జెట్ అనాలిసిస్)
ముఖ్యమైన పాయింట్లు
ఏడు నెలల్లోనే సగం (50 శాతం) బడ్జెట్ టార్గెట్ సాధించారు. ఇది సాధారణంగా బాగున్నట్టే కనిపిస్తుంది.
కానీ YoY గ్రోత్ చాలా తక్కువ (ముఖ్యంగా GST + VAT కలిపి కేవలం 2.85 శాతం) ఆర్థిక డిమాండ్ బలహీనంగా ఉందని స్పష్టమైన సిగ్నల్.
కేంద్ర పన్నుల వాటా Q1లో −7.2 శాతం తగ్గింది. కార్పొరేట్ లాభాలు, దిగుమతులు తగ్గాయని అర్థం.
CAG నివేదికలు, 'బలహీనత' సూచనలు..
CAG అక్టోబర్ నివేదిక ప్రకారం మొదటి 6 నెలల్లో రాష్ట్ర స్వంత పన్నుల CAGR (2023-24 నుంచి) 2.75 శాతం మాత్రమే. GSDP 17.1 శాతం గ్రోత్ అంచనాకు విరుద్ధంగా ఉంది. GST + సేల్స్ ట్యాక్స్ 2.85 శాతం పెరుగుదల, Q1లో సొంత రెవెన్యూస్ 3.47 శాతం మాత్రమే. మొత్తం రెవెన్యూ డెఫిసిట్ 110 శాతం అంచనా (రూ.47,806 కోట్లు). ఫిజికల్ డెఫిసిట్ 85 శాతం (రూ.66,469 కోట్లు).
YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి CAG డేటాను ఉదహరించి "ఆర్థిక సూచికలు బలహీనంగా ఉన్నాయి. GST, సేల్స్ ట్యాక్స్‌లో మందగింపు, కానీ అప్పులు 62 శాతం పెరిగాయి" అని విమర్శించారు. గత పాలనలో (2019-24) సొంత పన్నులు 9.87 శాతం CAGRతో GSDP 10.23 శాతం కు సమానంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం 'డిస్‌క్రెపెన్సీ' కనిపిస్తోందని చెప్పారు. CAG విస్తృత రిపోర్ట్ (2025) ప్రకారం, రాష్ట్రాల పన్ను సేకరణలో ఏపీ 17వ ర్యాంక్, డెబ్ట్ సస్టైనబిలిటీ 'జీరో'.
రెవెన్యూ గ్రోత్ తక్కువ.. అప్పుల భారం పెరుగుదల
పన్ను రాబడి మంచిదైనప్పటికీ, GST-సేల్స్ ట్యాక్స్ మందగింపు వల్ల ప్రభుత్వం కొత్త పన్నులు (స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్)పై దృష్టి పెట్టవచ్చు. కేంద్ర షేర్ పెరిగినప్పటికీ, రెవెన్యూ ఖర్చులో 70 శాతం (రూ.1,39,445 కోట్లు) సాధించడంతో సంక్షేమ కార్యక్రమాలు (విద్య, ఆరోగ్యం)పై ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తులో పన్ను ఎఫిషెన్సీ (Efficiency) (చాలా తక్కువ వనరులతో (సమయం, డబ్బు, శ్రమ, ఇంధనం) ఎక్కువ ఫలితం సాధించడం.) పెంచకపోతే రుణాలు (ఇప్పటికే రూ.9.75 లక్షల కోట్లు) మరింత పెరిగి ప్రజలపై భారం మోపవచ్చు. ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల ఈ ఎఫిషెన్సీ తక్కువగా ఉందని విమర్శలు ఉన్నాయి. ఉదా: రూ. 100 పన్ను వసూలు చేయడానికి రూ. 15–20 ఖర్చు అవుతుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. (అధిక సిబ్బంది, పాత సాఫ్ట్‌వేర్, అవినీతి వల్ల).
డిజిటల్ కంప్లయన్స్, రెవెన్యూ ఎఫిషెన్సీ
GST కంప్లయన్స్‌ను బలోపేతం చేయాలి, పెట్రోలియం రేట్లు స్థిరీకరించాలి. "పన్ను గ్రోత్ GSDPకి సమానంగా ఉంటే స్థిరత్వం వస్తుంది" అని CAG హెచ్చరిస్తోంది. ప్రభుత్వం రెవెన్యూ పెంపుకు డిజిటల్ టూల్స్ (GSTN) ఉపయోగించినప్పటికీ మందగింపును విశ్లేషించి విధాన మార్పులు తీసుకురావాలి. రాష్ట్ర ఆర్థికం బలపడాలంటే పన్ను సేకరణే కీలకం.

