అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు.. సోమవారం నుంచి శనివారం వరకు మెను ఇదే
అన్న క్యాంటీన్ల ద్వారా వారం రోజుల్లో ఒక రోజు మినహాయించి మిగిలిన ఆరు రోజుల పాటు ఆహారాన్ని అందించనున్నారు. మెను కింద ఇచ్చే వెరైటీలు ఇవే.
ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్ల ద్వారా అందించేకు ఒక మెనును రూపొందించారు. దాని ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందించనున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌ను అందించనున్నారు. రూ. 5లకే వీటిని అందిస్తారు. రూ. 15లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌లను పూర్తి చేసుకోవచ్చు.
సోమవారం ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ ఇస్తారు. దానిలోకి చట్నీ, పొడి, సాంబార్ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకున్న వారికి పూరి, కుర్మా అందిస్తారు. మధ్యాహ్నం లంచ్ కింద వైట్ రైస్, ఏదైనా ఒక వెరైటీ కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. రాత్రి డిన్నర్ కింద ఇదే తరహాలో ఆహారం అందిస్తారు. మంగళవారం అల్పాహారం కింద ఇడ్లీ ఇస్తారు. దీనికి చట్నీ, పొడి, సాంబార్ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకున్న వారికి ఉప్మా ఇస్తారు. దీనిలోకి చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ అందిస్తారు. మధ్యాహ్నం లంచ్ కింద వైట్ రైస్ ఇస్తారు. దీనిలోకి ఒక కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు లంచ్, డిన్నర్ కింద దాదాపు ఇదే మెనును అమలు చేయనున్నారు. అయితే కూరలు మారుతాయి. ఒక్కో రోజు ఒక్కో వెరైటీ కూరగాయలతో కూడిన కూరను తయారు చేసి అందిస్తారు.