
అందుకే అసెంబ్లీకి వెళ్లాం
యుద్ధ రంగంలో ఉన్నాం..ప్రజల తరపున పని చేయాలి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్థేశం చేశారు.
ప్రజల సమస్యల మీద రాజీలేని పోరాటం చేయాలని.. మనం ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు సూచించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తోడుగా ఉంటే గెలుపు సాధించినట్లే అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద చేసే పోరాటంలో వెనక అడుగు వేయొద్దని శ్రేణులకు సూచించారు. కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని, అయినా కూటమి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.
కార్యక్తలు, నాయకులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు, పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసేందేకు ఇది సరైన సమయం అని అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తా అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారని, కళ్లు మూసి తెరిచే లోగా ఏడాది గడిచి పోతుందని, తర్వాత జమిలీ ఎన్నికలు వస్తాయని, ఒక వేళ జమిలీ ఎన్నికలే వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేసే క్రమంలో ఎక్కడా రాజీపడొద్దని, తగ్గాల్సిన అవసరం కూడా లేదన్నారు.
అసెంబ్లీలో ఉన్న వాటిల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్షమని, ప్రతిపక్ష హోదా ఇవ్వక పోవడంలో ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకే సోమవారం అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. కావాలనే ప్రతిపక్ష హోదాను అడ్డుకుంటున్నారని అన్నారు. అలా హోదా ఇస్తే.. సభా నాయకుడితో పాటు దాదాపు సమానంగా అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే నిరాకరిస్తున్నారని అన్నారు. తాను అసెంబ్లీలో ఏది మాట్లాడిన నిందలకు, దూషణలకు దూరమని, ప్రతీ అంశాన్ని ఆధారాలు, రుజువులతోనే మాట్లాడతానని అన్రాఉ. అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇక శాసన మండలిలో మంచి మెజారిటీ ఉందని కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు.