అందుకే పీఏసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలకు జరుగుతున్న ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సీపీ దూరం జరిగింది.
నిష్పక్షపాతంగా జరగాల్సిన పీఏసీ ఎన్నిక పక్షపాత ధోరణితో నిర్వహిస్తున్నారని, అందవల్ల ఏపీసీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం ఇవ్వక పోవడంతో ఈ పీఏసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో పీఏసీ ఎన్నికలను తాము బహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోందని, అదే మార్గంలోనే ఎన్నికలను నిర్వహిస్తోందన్నారు. అందువల్లే ఈ పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో ప్రతిపక్షంలోని సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి పీఏసీ ఇచ్చారన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా లేని పార్టీలకు కూడా అనేక సార్లు పీఏసీ పదవులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయన్నారు. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి పరిణామాలు అనేక సార్లు చోటు చేసుకుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతుంది. అందువల్లే ఏపీసీ పదవిని ప్రతిపక్షానికి ఇస్తారు. ఒక్క తాలీబాన్లు పాలిస్తున్న ఆఫ్గనిస్థాన్‌లో తప్ప, ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న ప్రపంచ దేశాలన్నింటిలోను ప్రతిపక్షానికే పీఏసీ పదవి ఇస్తారని వెల్లడించారు. టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ వంటి అనేక స్కామ్‌లను పీఏసీ వెలిక తీసినవే అన్నారు.
గతంలో 1994లో నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యామన్నారు. తమ పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సీపీకి 2019లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు.
Next Story