
గోదావరి జిల్లాలకు అది గేమ్ ఛేంజర్‌గా మారింది
రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు అన్నారు.
వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్ పామ్ అనేది ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్ గా మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు. కలెక్టర్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిమాండ్, సప్లైకి అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్య పరచటంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో క్లస్టర్ అప్రోచ్ ఉండాలి అని కలెక్టర్లకు సీఎం సూచించారు. మైక్రో ఇరిగేషన్ లో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. రాయలసీమ ఉద్యాన పంటల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువ ఉందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
అంతర్జాతీయంగా వస్తున్న సమస్యలతో ఈ పంటలపై ప్రభావం పడుతోందన్నారు. హెచ్డీ బర్లీ పొగాకు 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేశామన్నారు. మామిడికి కిలో రూ.4 చొప్పున రూ.200 కోట్ల వరకూ రైతులకు చెల్లించాం. ఉల్లి పంట కొనుగోలు విషయంలో ప్రతిపక్షం డ్రామాలు ఆడుతోంది. ప్రస్తుతం క్వింటాను రూ.1200తో కొనుగోలు చేస్తున్నాం. ఎలా చేస్తే రైతులకు లాభం వస్తుందో అధ్యయనం చేసి ఆయా మార్గాలు అనుసరించాలి. కాస్ట్ టూ కల్టివేషన్ ధర వస్తే రైతులు బయటపడతారు. రైతులకు నష్టం రాకుండా రవాణా ఛార్జీలు భరించి ప్రాసెసింగ్‌కు పంపించేందుకు అవకాశం ఉంది. ఈ తరహాలోనే కలెక్టర్లు ఆలోచనలు చేయాలి. పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పర్యాటక ఎకోసిస్టం రూపోందించాలి. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలి సూచించారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగం అత్యంత కీలకం. భలబద్రాపురంలో ఇటీవల తలెత్తిన ఆరోగ్యపరమైన అంశాలను కూడా అధ్యయనం చేయండి. ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్లే ఇది తలెత్తిందా అన్న అంశాన్ని శోధించండి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.