ఇక గిరిజనులకు డోలీలతో పని లేదు..పవన్ కల్యాణ్
జోరు వానను లెక్క చేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్నీ ప్రాంతాల్లో పర్యటించారు. పలు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మన్యం జిల్లా గిరిజన ప్రాంతాల్లోని రోడ్ల గురించి ఆయన ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గంలో రోడ్ల వసతి లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇక ఆ సమస్యలు తీరాయని, గిరిజనులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. డోలీలతో ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పాఠశాలలకు వెళ్లే గిరిజన బిడ్డలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. పనులకు ముందు.. పనుల తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయో అని ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ట్వీట్టర్ లో ఆయన ఏమని పేర్కొన్నారంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలంలో రోడ్ల మరమ్మతుల పనులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించాను. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2.00 కిలోమీటర్లు మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ తారు రోడ్డు పంచాయతీ రాజ్ విభాగంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. సదరు రోడ్డు పూర్తి చేయడం ద్వారా 170 జనాభా కలిగిన మర్రిపుట్టు గ్రామమునకు డోలి మోతలు నివారించి, విద్య,వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువయ్యేలా చేయడం జరిగింది.