తాడిపత్రిలో టెన్షన్ ...టెన్షన్
x

తాడిపత్రిలో టెన్షన్ ...టెన్షన్

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యక్షంతో టెన్షన్ ..టెన్షన్ అప్రమత్తమైన పోలీసులు.రప్పా..రప్పా అంటూ జేసీ వార్నింగ్


అనంతపురం జిల్లా తాడిపత్రి లో ఈ ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసులను కలవర పెట్టాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా తాడిపత్రికి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి,ఇటు పెద్దారెడ్డి నివాసానికి వారి అనుచరులు భారీగా చేరుకోవడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు , తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని కేతిరెడ్డి చెప్పారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి భారీగా తన అనుచరులతో పెద్దారెడ్డి నివాసంవైపు బయలు దేరడంతో పోలీసులు జోక్యం చేసుకొని మధ్యలో ఆపివేశారు. ఇటు పెద్దారెడ్డిని అదుపులోనికి తీసుకొని అనంతపురం తరలించారు.

జేసీ రప్పా..రప్పా వార్నింగ్
ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గతంలో వైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని జేసీ ఆరోపించారు. తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని మండిపడ్డారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో వుంటే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందన్న ,జేసీ వైసీపీ కార్యకర్తలపై తమకు కోపం లేదని , తమ ఆగ్రహం పెద్దారెడ్డిపైనే అన్నారు.పెద్దారెడ్డిని ఎవరైనా అనుసరిస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించిన జేసీ,ఈరోజు పెద్దారెడ్డితో కలిసి వచ్చిన వాళ్లు ఎవరో తనకు తెలుసంటూ, వారి ఫొటోలు తనదగ్గర వున్నాయని వారందరికీ రప్పా..రప్పా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటికి కూడా అనుమతి లేదని జేసీ తెలిపారు.
Read More
Next Story