పుంగనూరులో టెన్షన్ టెన్షన్
x

పుంగనూరులో టెన్షన్ టెన్షన్

చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.


చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళ దాడి చేసుకున్నారు. వైసీపీ మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లిన నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం ఉదయం మిథున్ రెడ్డి ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి రాళ్ళ దాడికి దారితీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

వైసీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన్ని పుంగనూరుకి రావడానికి వీల్లేదంటూ టీడీపీ కార్యకర్తలు భీష్మించుకుని కూర్చున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పుంగనూరుకి రాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఈరోజు మిథున్ రెడ్డి.. రెడ్డప్ప ఇంటికి వచ్చారు. ఆయన్ని పరామర్శించి బయటకి వస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తచిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.లు అక్కడికి చేరుకున్నారు. గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు మాటలదాడి చేసుకున్నారు. ఇది కాస్తా రాళ్ళ దాడి వరకు వెళ్ళింది. ఘటనలో కొంతమంది గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసులకువచ్చారు.

మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యే ప్రమాదం...

కాగా ఘటనపై మిథున్ రెడ్డి స్పందిస్తూ... టీడీపీ దాడులకు బీజం వేస్తోందని, వీటివలన మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. టీడీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళనలకు గురి చేస్తున్నారని, నిన్న వినుకొండలో కూడా వైసీపీ కార్యకర్తని దారుణంగా చంపేశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు వారికి జరుగుతున్న అన్యాయంపై కేసులు పెట్టడానికి వెళ్తే తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన సూచించారు.

దాడిపై వైసీపీ ఆగ్రహం...

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్లదాడి జరిపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పుంగనూరు పట్టణం టీచర్స్ కాలనీలో ఉన్న రెడ్డప్ప ఇంటిపైకి గూండాలు రాళ్లతో దూసుకొచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి రాకతో మరింత రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. పోలీసులు అడ్డుకున్నా.. వారిపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడుల సంస్కృతిని టీడీపీ నాయకులు వెనకుండి ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఆరోపించింది.

టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్ళిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు అసలు రక్షణ కల్పించగలదా? అని ప్రశ్నించారు. "ఒక ఎంపీపై రాళ్ళ దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి.. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకోవాలని కోరుతున్నాను" అని ఎంపీ గురుమూర్తి అన్నారు.

మిథున్ రెడ్డి కొట్టించాడు అంటోన్న టీడీపీ..

పుంగనూరు ఘటనపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. మిథున్ రెడ్డి తన అనుచరులకు గంజాయి తాగించి పోలీసులపై దాడి చేయించాడని ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. "పుంగనూరులో రెచ్చిపోయిన వైసీపీ సైకోలు.. టిడిపి శ్రేణులని రెచ్చగొడుతూ గ్రామాల్లో కాన్వాయ్ వేసుకుని తిరుగుతూ రెచ్చిపోయిన మిథున్ రెడ్డి.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చిపోయిన వైసీపీ గూండాలు. దగ్గరుండి పోలీసులపై దాడులు చేయించిన పిల్ల సైకో మిథున్ రెడ్డి. తన అనుచరులకి గంజాయి తాగించి పోలీసులను రాళ్ళతో సైకో మిథున్ రెడ్డి కొట్టించాడు" అని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది.

Read More
Next Story