
పార్లమెంట్ స్థాయీ సంఘాల్లో తెలుగు ఎంపీలు
పార్లమెంట్ స్థాయీ సంఘాలను కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలు.
కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల వ్యవహారాలను పరిశీలించే పార్లమెంటు స్థాయీ సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. కమిటీల్లో సభ్యులగా నియమితులైన తెలుగు రాష్ట్రాల ఎంపీల వివరాలు.
వాణిజ్యం: శ్రీభరత్ మతుకుమిల్లి (విశాఖపట్నం), సానా సతీష్‌బాబు, రేణుకాచౌదరి (రాజ్యసభ)
హోం: కేశినేని శివనాథ్ (విజయవాడ), కృష్ణప్రసాద్ తెన్నేటి (బాపట్ల) విద్య, మహిళ, శిశు, యువత, క్రీడలు, దగ్గుబాటి పురందేశ్వరి (రాజమండ్రి)
పరిశ్రమలు: ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), మల్లు రవి (నాగర్‌కర్నూలు), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బీద మస్తాన్‌రావు (రాజ్యసభ), అభిషేక్ సింఘ్వీ (రాజ్యసభ)
శ్రీ భరత్ మతుకుమిల్లి, ఎంపీ, విశాఖపట్నం
సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు: వంశీకృష్ణ గడ్డం (పెద్దపల్లి), కేఆర్ సురేష్‌రెడ్డి, పాకా వెంకట సత్యనారాయణ, పరిమళ్ నత్వానీ (రాజ్యసభ)
రవాణా, పర్యాటకం, సాంస్కృతికం: సురేష్‌కుమార్ శెట్కార్ (జహీరాబాద్), తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (కాకినాడ), గొల్ల బాబూరావు (రాజ్యసభ)
దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ, రాజమహేంద్రవరం
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: కడియం కావ్య (వరంగల్), బైరెడ్డి శబరి (నంద్యాల), బి.పార్థసారథిరెడ్డి (రాజ్యసభ)
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయం: మాధవనేని రఘునందన్‌రావు (మెదక్)
కమ్యూనికేషన్లు, ఐటీ: కలిశెట్టి అప్పలనాయుడు (విజయనగరం), రామసహాయం రఘురాంరెడ్డి (ఖమ్మం), ఎస్.నిరంజన్‌రెడ్డి (రాజ్యసభ)
కేశినేని శివనాథ్, ఎంపీ, విజయవాడ.
రక్షణ: కేశినేని శివనాథ్ (విజయవాడ), దామోదరరావు దీవకొండ (రాజ్యసభ)
ఇంధనం: కుందూరు రఘువీర్ (నల్గొండ)
విదేశాంగ వ్యవహారాలు: డీకే అరుణ (మహబూబ్‌నగర్), అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప), ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, కె లక్ష్మణ్ (రాజ్యసభ)
ఆర్థికం: లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), సీఎం రమేష్ (అనకాపల్లి), పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు), వైవీ సుబ్బారెడ్డి (రాజ్యసభ)
వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ
ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాలు: బస్తిపాటి నాగరాజు (కర్నూలు), రాగ్యా కృష్ణయ్య (రాజ్యసభ)
కార్మిక, జౌళి, నైపుణ్యాభివృద్ధి: జీఎం హరీష్ బాలయోగి (అమలాపురం), జి లక్ష్మీనారాయణ (అనంతపురం)
పెట్రోలియం, సహజవాయువు: మద్దిల గురుమూర్తి (తిరుపతి), పుట్టా మహేష్‌కుమార్ (ఏలూరు), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), వద్దిరాజు రవిచంద్ర (రాజ్యసభ)
రైల్వే: కె లక్ష్మణ్, మేడా రఘునాథరెడ్డి (రాజ్యసభ)
లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీ, నర్సరావుపేట.
గృహ, పట్టణాభివృద్ధి వ్యవహారాలు: గుమ్మ తనూజారాణి (అరకు), చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (భువనగిరి)
ఎరువులు, రసాయనాలు: ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), దగ్గుమళ్ల ప్రసాదరావు (చిత్తూరు), పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రాజ్యసభ)
తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎంపీ, బాపట్ల.
బొగ్గు, గనులు, ఉక్కు: బీకే పార్థసారథి (హిందూపురం), ఎం అనిల్ కుమార్ యాదవ్ (రాజ్యసభ)
సామాజిక న్యాయం, సాధికారత: గోడం నగేష్ (ఆదిలాబాద్), వి విజయేంద్ర ప్రసాద్ (రాజ్యసభ)
ఇన్సాల్వెన్సీ, బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్ సవరణ బిల్లు-2025 కోసం ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ: డి పురందేశ్వరి (రాజమండ్రి), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట)
జన్‌విశ్వాస్ సవరణ బిల్లు 2025 కోసం ఏర్పాటుచేసిన సెలెక్ట్ కమిటీ: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), శ్రీభరత్ మతుకుమిల్లి (విశాఖపట్నం).