
జనసేనకు తెలంగాణ జన్మనిచ్చింది
తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నేల తనలో ఉద్యమ స్పూర్తిని నింపిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల అంటూ పవన్ కల్యాణ్ సోమషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ ఎమన్నారంటే..
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల.. నాకు పునర్జన్మను ఇచ్చిన నేల.. నాలో ఉద్యమ స్పూర్తని నింపిన నేల.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దాశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్థులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటూ ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025
Next Story