
సత్య నాదెండ్లతో చంద్రబాబు కుటుంబం (ఫైల్ ఫోటో)
MICROSOFT- సత్య నాదెండ్ల డిసెంబర్ లో ఆంధ్రా పర్యటన!
సత్య తండ్రి B.N. Nadella 1962 బ్యాచ్ IAS అధికారి.B.N. ఆయన ప్రగతిశీల ఆలోచనలకు వారసునిగా, సత్య నాదెండ్ల ఏపీ అభివృద్ధికి సహకరిస్తారని అంచనా..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల డిసెంబర్‌లో భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలపై ఆయన న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై లెవెల్ మీటింగ్‌లలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ ఆయన రాకపోతే న్యూఢిల్లీ లేదా బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడో లేదా ఆయన కుమారుడు లోకేశ్ అయినా అక్కడికి వెళ్లి కలుస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇవేవీ కుదరని పక్షంలో ఆన్‌లైన్ ఇంటరాక్షన్ ఉండొచ్చన్న సంకేతాలు ఇప్పుడు టెక్ వర్గాలలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవలే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సత్య నాదెండ్ల ఆంధ్రప్రదేశ్ వస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సత్య నాదెండ్లను ఇప్పటికే ఆహ్వానించిన లోకేశ్..
సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతిని తిరిగి గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఆ దిశలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, సత్య నాదెండ్లతో సహా పలువురు గ్లోబల్ టెక్ నేతలతో సంప్రదింపులు జరిపారు. లోకేశ్ అమెరికా వెళ్లి నాదెండ్లతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా. AI లిటరసీ, డిజిటల్ గవర్నెన్స్, ఈ సర్వీసెస్ ఇంటిగ్రేషన్ అంశాలపై సహకారం కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందువల్ల, ఈ పర్యటనలో ఒక ప్రైవేట్ మీటింగ్ లేదా అనధికార ఇంటరాక్షన్ జరగవచ్చని ఊహాగానాలు బలపడుతున్నాయి.
భారత డిజిటల్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని నాదెండ్ల ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఏపీ రావొచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టు ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సత్య నాదెండ్ల స్వయంగా X (Twitter)లో స్పందిస్తూ, “India’s cloud infrastructure momentum is inspiring — proud to see Andhra Pradesh leading from the front.” అని పేర్కొన్నారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ రావడానికి ఈ ట్వీట్ కూడా ఓ కారణం కావొచ్చునని అంచనా. సత్య నాదెండ్ల టూర్ లో ఇదో కీలక ఆజెండాగా మారే అవకాశం ఉంది. AI, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య సహకారం పెరుగుతున్న తరుణంలో ఈ స్పందనను వ్యూహాత్మకంగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తో కుటుంబ అనుబంధం
సత్య నాదెండ్ల తండ్రి బుక్కపురం నాగేశ్వర నాదెండ్ల (B.N. Nadella) 1962 బ్యాచ్ IAS అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినవారు. ఆయన రాష్ట్ర ప్రణాళిక శాఖ, కార్మిక శాఖ, ఆర్థిక ప్రణాళిక బోర్డులో పనిచేశారు. ఈ నేపథ్యం వల్ల సత్య నాదెండ్లకు ఆంధ్రప్రదేశ్‌తో వ్యక్తిగత అనుబంధం ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడితో బీఎన్ నాదెండ్ల కుటుంబానికి కూడా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఈ హోమ్‌కమింగ్ కనెక్ట్ కారణంగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
B.N. నాదెండ్ల ప్రగతిశీల ఆలోచనలకు వారసుడిగా, సత్య నాదెండ్ల ఇప్పుడు ఆర్థిక సాంకేతిక మార్పులలో పాత్ర పోషించవచ్చని రాజకీయ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో AI, సైబర్ సెక్యూరిటీ హబ్, అమరావతిలో డేటా ఇన్నోవేషన్ సిటీ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దశలో నాదెండ్ల పర్యటన జరిగితే, అది రాష్ట్ర టెక్ ఎకోసిస్టమ్ కి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ సిగ్నల్ గా మారవచ్చు. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ AI క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ “Azure”ను ఈ గవర్నెన్స్‌లో సమీకరించే దిశలో చర్చలు జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
నాదెండ్ల–చంద్రబాబు లేదా లోకేశ్ భేటీ జరిగితే, అది కేవలం మర్యాదపూర్వకమైందే కాదు- అది ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్ మ్యాప్ పై తిరిగి వెలుగొందుతుందనే సంకేతం. మైక్రోసాఫ్ట్ సహకారం రాష్ట్రానికి AI శిక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో కొత్త అవకాశాలను తెరుస్తుంది.
సత్య నాదెండ్ల అధికారిక షెడ్యూల్ లో ఆంధ్రప్రదేశ్ పేరు లేకపోయినా — లోకేశ్ ఆహ్వానం, ఆయన తండ్రి IAS నేపథ్యం, గూగుల్ ఒప్పందంపై ట్వీట్ — ఈ మూడు సంకేతాలు కలిపి చూసినపుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు తప్పక ప్రాధాన్యత ఇవ్వవచ్చుననే వాదనకు బలం లభిస్తోంది.
AI యుగంలో భారతదేశం గ్లోబల్ టెక్ సెంటర్ గా రూపుదిద్దుకుంటుంటే,ఆ దిశలో అమరావతి, విశాఖ టెక్- ఆంధ్రప్రదేశ్ రివైవల్ కి సంకేతం కావొచ్చు. మరి ఆ మొదటి అడుగు సత్య నాదెండ్ల డిసెంబర్ పర్యటన నుంచే పడుతుందేమో చూడాలి.
Next Story

