దేశం గెలవాలని టీడీపీ ప్రార్థనలు..మ్యాచ్ చూసేందుకు స్క్రీన్లు
x

దేశం గెలవాలని టీడీపీ ప్రార్థనలు..మ్యాచ్ చూసేందుకు స్క్రీన్లు

మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు గెలవాలని టీడీపీ శ్రేణులు దేవాలయాలలో ప్రార్థనలు చేశారు.


ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ లో భారత్‌ జట్టుకు మద్దతు పెరుగుతోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారత జట్టు మీద తమ అభిమానాలు చాటుకున్నారు.

ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలవాలని కోరుతూ రాష్రంలోని పలు దేవాలయాలలో ప్రార్ణనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వంటి ప్రసిద్ధ ఆలయాల్లో భారత మహిళల జట్టుకు విజయం కోసం శ్రద్ధాభక్తితో ప్రార్థించారు. ఈ పార్థనల్లో ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

"భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించాలని, దేశానికి మరో వరల్డ్ కప్ తెచ్చిపెట్టాలని దేవుడు కరుణ చూపాలి" అంటూ పార్థనలు చేసిన టీడీపీ నాయకులు, స్థానిక మహిళల అభివృద్ధికి క్రికెట్ ప్రేరణగా మారాలని కోరారు.

అదే సమయంలో, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నాయకులు మ్యాచ్‌ను ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

జనసేన పార్టీ అధినేత, కూటమి కీలక నాయకుడు పవన్ కల్యాణ్ స్వయంగా విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద భారీ స్క్రీన్‌ను ప్రారంభించి, అభిమానులతో కలిసి మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు.

గ్రామాలు, మండలాల స్థాయిలో టీవీలు, లెడ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, మహిళలు, యువతను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

కప్ కోసం జరుగుతున్న ఆఖరిపోరులో ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి.

ఇప్పుడు జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 280 పరుగుల వరకు లక్ష్యం దాటాలని కోచ్ అమోల్ మొజింకర్ జట్టుకు సూచించారు. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలమైన బౌలర్లతో సవాలు విసురుతోంది.

Read More
Next Story