
కోడికత్తి కమల్ హాసన్ అంటూ జగన్ పై టీడీపీ పోస్టు
తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియాలో జగన్ పై పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో జగన్ పై శ్రీనివాస్ దాడి చేసి శనివారం తో ఏడేళ్లు అయిన సందర్భంగా దీనిని గుర్తు చేస్తూ వ్యంగ విమర్శలతో కూడిన పోస్టును టీడీపీ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఆ పోస్టులో ఏముందంటే..
ఈ ఆస్కార్ పెర్ఫార్మెన్స్
ఇచ్చి నేటికి ఏడేళ్ళు..
ఇచ్చి నేటికి ఏడేళ్ళు..
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు, గులకరాయి దాడి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ కేసులు వైసీపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మధ్య ఆరోపణలకు, న్యాయపోరాటాలకు దారితీశాయి. ఇవి ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతమయ్యాయి.
1. కోడికత్తి కేసు (2018 దాడి కేసు)
- ఘటన వివరాలు: 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై జన్నుపల్లి శ్రీనివాస్ (అలియాస్ కోడికత్తి శ్రీను) కోడి కత్తితో దాడి చేశాడు. జగన్‌కు తేలికపాటి గాయాలు పాలయ్యాయి. ఈ దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తర్వాత ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఎన్‌ఐఏ కోర్టులో విచారణలు జరిగాయి. తర్వాత శ్రీను జైలుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.
2. జగన్ పై గులకరాయి దాడి (2024 ఎన్నికల సమయంలో)
- ఘటన వివరాలు: 2024 ఏప్రిల్ 17న విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో జగన్ పై గులకరాయితో దాడి జరిగింది. జగన్ వాహనం టాప్‌పై నిలబడి ప్రసంగిస్తుండగా, దాడి జరిగి తలకు గాయం పాలైంది. దాడి చేసిన వేముల సతీష్ కుమార్ (18), దుర్గారావు (A2 నిందితుడు)లు అరెస్ట్‌య్యారు. విజయవాడ పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశాయి. సతీష్‌ను ఏప్రిల్ 18, 2024న అరెస్ట్ చేశారు. దుర్గారావును అనుమానంగా తీసుకెళ్లి, ఏప్రిల్ 21, 2024న విడుదల చేశారు. దాడి వెనుక టీడీపీ ప్రోద్బలం ఉందని వైసీపీ ఆరోపించింది.
3. వైఎస్ వివేకానందరెడ్డి హత్య (2019)
- ఘటన వివరాలు: 2019 మార్చి 15 అర్ధరాత్రి తర్వాత కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (వివేకా) హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుగా చెప్పగా, తర్వాత గొడ్డలతో నరకడం (రక్తపు మడగులు, గాయాలు) ద్వారా హత్య అని తేలింది. వివేకా జగన్ బాబాయి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తుల వరుస మరణాలు కూడా పలు అనుమానాలకు దారి తీశాయి. సాక్షుల మరణాలు (రంగన్న, శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి మొదలైనవారు) కలకలం రేపాయి. వైఎస్ సునీత సుప్రీం కోర్టులో పోరాడుతోంది.
Next Story

