గోదావరి వరదను బిందెలతో ఆపండి..
x

గోదావరి వరదను బిందెలతో ఆపండి..

బనకచర్ల వివాద నేపధ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి సెటైర్లు


"గోదావరి వరదను ఆపండయ్యా..బీఆర్ఎస్ నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా.. కనీసం కాంగ్రెసోళ్లు చెంబులతో అయినా ఆపండయ్యా" ఇవి తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఏంటి గోదావరి వరదను బిందెలతో ఆపడం ఏమిటనుకుంటున్నారా.. ఇదంతా తెలుగుదేశం నేత పక్కరాష్ట్ర ప్రతిపక్షం , అధికార పక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రాలు.తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు వివాదం చర్చనీయాంశంగా మారింది.వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోని రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ నీరు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్లాన్‌ చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తమకు నష్టం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోంది.గోదావరి వరద జలాల్లో కూడా తెలంగాణకు వాటా రావాలని పలువురు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాలు ,ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి నది పొంగ పోర్లుతోంది. నది వరద నీరు పెరిగి వృధాగా సముద్రంలో కలుస్తోంది.ఈ నేపధ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .రోజుకు 50, 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.వరద నీటిని వాడుకోవద్దనే తెలంగాణ నేతలు వృధాగా పోతున్న నీటి విషయంలో ఏమి మాట్లాడుతారని ప్రశ్నించారు.
Read More
Next Story