మోదీ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి
x

మోదీ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి

అమరావతిలో సభా ప్రాంగణాన్ని అద్బుతంగా తయారు చేశారు.


అమరావతి నిర్మాణ పనులు పునఃప్రాంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణం అంతా సిద్ధమైంది. సభలో కూర్చునే ప్రజలకు ఎండ వేడి నుంచి, శగ నుంచి, ఉక్క పోత నుంచి సేదదీరుతూ ప్రధాని మోదీ ఉపన్యాసం శ్రద్ధగా వినేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పెద్ద పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభానికి గుర్తుగా పైలాన్‌ను ప్రధాని మోదీ పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5లక్షల మంది ప్రజలు హాజరు కానున్నారు. 3531 ఆర్టీసీ బస్సులు, మరో 4050 ప్రైవేటు వాహనాల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. రాజధానికి 8 మార్గాల ద్వారా రాకపోకలు జరిగే విధంగా రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. 11 ప్రదేశాలలో విశాలమైన పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక వేళ వర్షం పడినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్‌ స్థలాలను కూడా సిద్ధం చేశారు.

సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

మోదీ సభ ప్రధాన వేదిక

గ్యాలరీల వారీగా సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌

గురువారం రాత్రి విద్యుత్‌ కాంతుల్లో సభా ప్రాంగణం

Read More
Next Story