ఏపీలో ఈనెల 14 నుంచి స్విగ్గీ సేవలు
x

ఏపీలో ఈనెల 14 నుంచి స్విగ్గీ సేవలు

ఆర్థిక పరమైన కారణాల వల్ల స్విగ్గీ సేవలను ఈనెల 14 నుంచి ఆపివేసేందుకు నిర్ణయించామని, అయితే ఆ సంస్థ ప్రతినిధుల హామీతో హోటల్స్‌ వారు విరమించారు.


ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీ సేవలు యాథావిధిగా కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారతీనగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం గురువారం జరిగింది. ఈ నెల 14 నుంచి స్విగ్గీ సేవలు యథావిధిగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి స్విగ్గీ సేవలు నిలిపి వేస్తునట్లు గతంలో హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. అయితే స్విగ్గీ జాతీయ ప్రతినిధులు, రాష్ట్ర ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ ఆసోసియోషన్‌ వారితో చర్చలు జరిపి హోటల్స్ వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించినందున వారి సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మొట్ట మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీ, జొమాటోలను బాయ్‌ కట్‌ చేయటం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. స్విగ్గీ నేషనల్‌ హెడ్స్‌ హోటల్స్ వారితో మాట్లాడి నందున సమస్య పరిష్కారం అయింది.

కొన్ని ఆర్థిక కారణాలతో 14 నుంచి స్విగ్గీ, జొమాటో సేవలు నిలిపేస్తున్నట్లు గతంలో హోటల్స్ అసోసియేషన్ వారు ప్రకటించారు. స్విగ్గీ వారు ఆంధ్రప్రదేశ్‌ వారు కావడంతో వేగంగా స్పందించి స్విగ్గీ నేషనల్‌ హెడ్స్‌ హోటల్స్‌ ఆసోసియేషన్‌ వారితో చర్చలు జరిపారు. నవంబర్‌ 12 నుంచి డిమాండ్స్ ను అమలు చేస్తామని స్విగ్గీ వారు హామీ ఇచ్చినట్లు హోటల్స్ అసోసియేషన్ వారు తెలిపారు. హోటల్స్ వారు పెట్టిన డిమాండ్స్ హోటల్‌ యజమానులకు, వినియోగదారులకు మేలు చేస్తాయని హోటల్స్ అసోసియేషన్ వారు చెబుతున్నారు.

Read More
Next Story